AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోవా అడవుల్లో నటి సమీరా రెడ్డి కలల సౌధం.. విలాసవంతమైన బంగ్లా లోపల వింత విశేషాలివే!

ముంబై మహానగరంలోని ఉరుకుల పరుగుల జీవితం, గ్లామర్ ప్రపంచానికి దూరంగా.. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలని ఎవరికి ఉండదు? సరిగ్గా అదే పని చేసి చూపిస్తోంది ఒకప్పటి టాలీవుడ్, బాలీవుడ్ మెరుపు తీగ. పెళ్లి తర్వాత సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చి, గోవాలోని పచ్చని ప్రకృతి మధ్య తనకంటూ ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించుకుంది.

గోవా అడవుల్లో నటి సమీరా రెడ్డి కలల సౌధం.. విలాసవంతమైన బంగ్లా లోపల వింత విశేషాలివే!
Sameera Reddyy
Nikhil
|

Updated on: Feb 19, 2026 | 6:00 AM

Share

మూడు అంతస్తుల భారీ బంగ్లా, చుట్టూ అడవిని తలపించే తోట.. అక్కడ ఆమె తన భర్త, పిల్లలతో కలిసి గడుపుతున్న క్షణాలు చూస్తుంటే ఎవరికైనా అసూయ కలగక మానదు. ఆమె ఒకప్పుడు వెండితెరపై తన అందచందాలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కానీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త అక్షయ్ వార్ధేను వివాహం చేసుకుని గ్లామర్ ప్రపంచానికి దూరమైంది. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్ గా మారి తన సహజత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆ నటి మరెవరో కాదు.. సమీరా రెడ్డి. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ సమీరా రెడ్డి గోవా ఇంటికి వెళ్లారు. అక్కడ సమీరా ఆత్మీయ ఆతిథ్యం, ఆ ఇంటి విశేషాలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మినీ ఫారెస్ట్..

సమీరా రెడ్డి బంగ్లాలోకి ప్రవేశించగానే ముందుగా మనల్ని పలకరించేది అక్కడి పచ్చదనం. ఇంటి చుట్టూ రకరకాల చెట్లతో అది ఒక చిన్న అడవిలా కనిపిస్తుంది. వేప, సపోటా, కొబ్బరి, వెదురు, అరేకా పామ్స్ వంటి ఎన్నో రకాల మొక్కలు అక్కడ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి, స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇంటి ప్రధాన ద్వారం నీలం, తెలుపు రంగుల టైల్స్‌తో.. పురాతన శైలిలో ఉండే భారీ చెక్క తలుపుతో రాజసంగా కనిపిస్తుంది.

ఇంటి లోపల అలంకరణ చాలా సింపుల్ గా, క్లాసిక్ గా ఉంటుంది. గోడలకు లేత క్రీమ్ మరియు సేజ్ గ్రీన్ రంగులు వేయడం వల్ల గదికి ఒక ప్రశాంతమైన లుక్ వచ్చింది. మూడు సీట్ల చెక్క సోఫా, పక్కనే ప్యాస్టల్ కలర్ దిండ్లు ఉన్న డే బెడ్ మధ్యాహ్నం వేళ విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉంది. గది మధ్యలో వేలాడే చెక్క లాంతరు, గోడలకు ఉన్న ఎల్లో బల్బులు సాయంత్రం వేళ ఇంటికి వెచ్చదనాన్ని ఇస్తాయి. సమీరా ఇంటి బాల్కనీ ఒక ప్రత్యేక ఆకర్షణ. అక్కడ వికర్ కుర్చీలు, అద్దం టాప్ ఉన్న టేబుల్ టీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకోవడానికి సరైన చోటు. ఒక మూలన వేలాడే ఎగ్ చైర్ చదువుకోవడానికి లేదా ఏకాంతంగా గడపడానికి బాగుంటుంది. సమీరా కంటెంట్ క్రియేటర్ కాబట్టి, బాల్కనీలోనే ఒక రింగ్ లైట్ స్టాండ్ కూడా ఉండటం గమనార్హం. వంటగది చాలా ప్రాక్టికల్ గా ఉంది. పైన తెలుపు, కింద డార్క్ బ్రౌన్ క్యాబినెట్లతో ఆధునికంగా కనిపిస్తుంది. డైనింగ్ ఏరియాలో పెద్ద చెక్క టేబుల్, గోడకు ఉన్న అరల్లో పుస్తకాలు, బొమ్మలు, చిన్న మోడల్ కార్లు ఉన్నాయి. ఇది కేవలం భోజనం చేసే చోటు మాత్రమే కాదు, కుటుంబం మొత్తం కలిసి సమయం గడిపే ప్రదేశంలా కనిపిస్తుంది.

ఈ ఇంట్లో సమీరాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం టెర్రస్. విశాలంగా ఉండే ఈ డాబాపై ఎల్లో కలర్ సోఫా సెట్ ఉంటుంది. ఫరా ఖాన్ వచ్చినప్పుడు సమీరా ఆమెతో స్వయంగా చెట్టు నుండి కొబ్బరి బొండాం కోయించడం ఆ వీడియోలో హైలెట్ గా నిలిచింది. బెడ్ రూమ్ లో ఉన్న స్లైడింగ్ గ్లాస్ డోర్స్ తెరిస్తే చాలు ప్రకృతి మనల్ని పలకరిస్తుంది. సమీరా రెడ్డి గోవా ఇల్లు చూస్తుంటే.. ఆడంబరాల కంటే అనుబంధాలకు, ప్రకృతికి ఆమె ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, కుటుంబ సభ్యుల నవ్వుల మధ్య ఆమె నిర్మించుకున్న ఈ స్వర్గం నిజంగా అద్భుతం.

Follow Us