AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా చేసినందుకు అభిమానులు కూడా తిట్టారు.. మనసులో మాట బయటపెట్టిన సీనియర్ హీరోయిన్‌

అప్పట్లో తన కళ్లతోనే కవితలు పలికించిన అభినేత్రి ఆమె. అటు అద్భుతమైన నటన, ఇటు మేటి నాట్యంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. చిరంజీవి వంటి మెగాస్టార్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచే ఉన్నాయి.

ఆ సినిమా చేసినందుకు అభిమానులు కూడా తిట్టారు.. మనసులో మాట బయటపెట్టిన సీనియర్ హీరోయిన్‌
Senior Heroine From Tollywood
Nikhil
|

Updated on: Feb 19, 2026 | 6:15 AM

Share

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె పంచుకున్న విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ‘సితార’ సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా చిరంజీవి పక్కన పోటీ పడి డాన్స్ చేయగల ఏకైక నటిగా ఆమె పేరు సంపాదించుకున్నారు. అయితే, తాజాగా వచ్చిన ‘నాట్యం’ సినిమాలో ఆమె చేసిన పాత్రపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరిగింది. ఆ సినిమాలో తన పాత్ర తీరు పట్ల స్వయంగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

ఆ సీనియర్ అందాల తార మరెవరో కాదు.. భానుప్రియ. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎదురైన కొన్ని పరిణామాల గురించి ఆమె మనసు విప్పి మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘నాట్యం’ సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంపై భానుప్రియ తీవ్రంగా స్పందించారు. మొదట కథ చెప్పినప్పుడు తన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని, కూతురిని ప్రోత్సహించే ఒక బలమైన తల్లి పాత్ర అని దర్శకులు వివరించారని ఆమె చెప్పారు. కానీ షూటింగ్ పూర్తయ్యేసరికి అది కేవలం ప్రాధాన్యం లేని ఒక సాధారణ పాత్రగా మిగిలిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమాలో తన పాత్ర నచ్చక అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని తెలియజేశారని ఆమె పేర్కొన్నారు.

ఎందుకు రాలేదంటే?

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌కు తరలిపోయినప్పుడు చాలామంది నటులు ఇక్కడే స్థిరపడ్డారు. కానీ భానుప్రియ మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. “అప్పట్లో హైదరాబాద్‌కు మారాలనే ఆలోచన రాలేదు. చెన్నైలోనే ఇల్లు ఉండటంతో అక్కడే సెటిల్ అయిపోయాను. ఇప్పటికీ మంచి కథాంశాలు ఉన్న సినిమాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు.

Bhanu Priya

Bhanu Priya

అప్పట్లో చిరంజీవి పక్కన రాధ, భానుప్రియ డాన్స్ చేయడమంటే అదొక పెద్ద పోటీగా ఉండేది. దీనిపై స్పందిస్తూ.. “చిరంజీవి అద్భుతమైన డాన్సర్. ఆయనతో కలిసి డాన్స్ చేయడం నాకు ఎంతో ఇష్టం. నాకంటే కూడా ఆయనతో పాటు నేను, రాధ డాన్స్ చేయడం ఒక చాలెంజ్ అని స్వయంగా ఆయనే అనేవారు” అని భానుప్రియ గుర్తు చేసుకున్నారు.

కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, కథకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకోవడం వల్లే తాను ఇంతకాలం నిలబడగలిగానని భానుప్రియ అభిప్రాయపడ్డారు. 1984లో మొదలైన భానుప్రియ సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఒక నటిగా తనకు సంతృప్తినిచ్చే పాత్రలు చేయడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. ‘నాట్యం’ సినిమా అనుభవం తర్వాత ఇకపై కథలను ఎంచుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటానని చెప్పుకొచ్చారు సీనియర్​ నటి భానుప్రియ.

Follow Us
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!
ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!
చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..
చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..
ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్
ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ