సల్మాన్ “బ్యాటిల్ ఆఫ్ గల్వాన్”పై చైనా తీవ్ర అభ్యంతరం.. పూర్తి వివరాలు..
రెండుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. గల్వాన్ ఘర్షణ ఆధారంగా దేశభక్తిని చాటే చిత్రంగా "బ్యాటిల్ ఆఫ్ గల్వాన్" సినిమా తెరకెక్కుతోంది. దీని టీజర్ రిలీజైంది. సల్మాన్‌ఖాన్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సరి లుక్కేయండి.

హిందీ చీనీ భాయ్ భాయ్ అని మనోళ్లు ఒకప్పుడు అంటే డ్రాగన్ కంట్రీ తలకెక్కలేదు. మనతో గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ఆ తప్పుల్ని ఎండగడితే మాత్రం, అదే చైనా తట్టుకోలేకపోతోంది. ఒక సినిమా ఇప్పుడు డ్రాగన్ కంట్రీని చిరాకు పరుస్తోంది. ఇప్పుడు చైనా బాధ ఏంటో చూద్దాం..
2020లో గల్వాన్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోయారు. భారత్‌కు చెందిన గల్వాన్ ప్రాంతంలోకి చైనా సైనికులు దూసుకొచ్చారు. కొన్నిరోజులపాటు రెండుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే చైనా సైనికులు చనిపోయారు. కానీ ఈ విషయాన్ని చైనా అధికారికంగా ధృవీకరించడానికి వెనుకాడింది. గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. గల్వాన్ ఘర్షణ ఆధారంగా దేశభక్తిని చాటే చిత్రంగా “బ్యాటిల్ ఆఫ్ గల్వాన్” సినిమా తెరకెక్కుతోంది. దీని టీజర్ రిలీజైంది. సల్మాన్‌ఖాన్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. చిన్న బృందంగా ఉన్న సైనికులు, పెద్దసంఖ్యలో ఉన్న ప్రత్యర్థులతో ఘర్షణ పడటానికి సై అంటారు. చివరి శ్వాస ఉన్నంతవరకు దేశం కోసం పోరాడతామని చాటుతారు.
గల్వాన్‌లో భారత సైన్యంలోని కల్నల్ సంతోష్ పోరాడి చనిపోవడం యావత్ దేశాన్నరి కలచివేసింది. తెలంగాణ బిడ్డకు ఈ దేశం సలామ్ చేస్తోంది. ఈ ఇతివృత్తమే ఇప్పుడు వెండితెర ముందుకు వస్తోంది. గల్వాన్ ఘర్షణల్లో ఎక్కువగా నష్టపోయిన చైనా- ఈ సినిమా గురించి వింటేనే చిరాకుపడిపోతోంది. సినిమా వల్ల చరిత్ర మారదు అంటూ బుకాయిస్తోంది. అయితే, సినిమా రిలీజైన తర్వాత ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.
