The Ghost: ఘోస్ట్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.? ఫ్యాన్స్‌కు జాతరే
కింగ్ అక్కినేని నాగార్జున కుర్ర హీరోలు తో పోటీపడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. రీసెంట్ గా బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాగ్.
కింగ్ అక్కినేని నాగార్జున( Nagarjuna )కుర్ర హీరోలు తో పోటీపడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. రీసెంట్ గా బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాగ్. ప్రస్తుతం కింగ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ‘ది ఘోస్ట్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరందుకున్నాయి. నాగార్జున- సోనాల్ చౌహాన్ ల బ్యూటీఫుల్ కెమిస్ట్రీతో యువతను ఆకట్టుకున్న ఫస్ట్ సింగిల్ వేగంతో మ్యూజిక్ ప్రమోషన్లు కూడా చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా జరగనుంది. కర్నూలులోని ఎస్టీబీసీ మైదానం ఈ వేడుకకు వేదికైంది. గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు టీమ్ అంతా హాజరుకానున్నారు.
అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో పాటు బోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే చిరు, నాగార్జున మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. నాగ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకు మెగాస్టార్ హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి నాగ్ కోసం మెగాస్టార్ రానున్నారని అంటున్నారు. కర్నూల్ లో జరిగే ఘోస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ సందడి చేయనున్నారట.. చిరుతో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా హాజరుకానున్నారని టాక్. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..