HiranyaKashipu: రానా హిరణ్యకశిప చేతులు మారిందా..? గుణశేఖర్ ప్లేస్‌లో ఆ దర్శకుడు

టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గుణశేఖర్. ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

HiranyaKashipu: రానా హిరణ్యకశిప చేతులు మారిందా..? గుణశేఖర్ ప్లేస్‌లో ఆ దర్శకుడు
Rana Daggubati
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 22, 2022 | 12:03 PM

టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గుణశేఖర్(Gunasekhar). ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అదే రేంజ్ హిట్ అందుకోవడానికి గుణశేఖర్ కు చాలా కాలం పట్టింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ అందుకోలేకపోయారు. ఆ తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమదేవి సినిమాతో మరో హిట్ అందుకున్నారు. హిస్టారికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత గుణశేఖర్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు రానా హీరోగా హిరణ్యకశిప సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘హిరణ్యకశిప’ ప్రాజెక్టు చేతులు మారిందంటూ టాక్. హిరణ్యకశిప సినిమా గుణశేఖర్ నుంచి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లిందని టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత రానా సినిమాను త్రివిక్రమ్ టేకోవర్ చేయనున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ విషయం పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో పవన్ కళ్యాణ్ రానా కలిసి నటించిన భీమ్లానాయక్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..