- Telugu News Photo Gallery Unni Mukundan Birthday: Bhaagamathie movie fame Unni Mukundan family career Movies and more detail in telugu
Unni Mukundan Birthday: భాగమతి మువీలో అనుష్కతో నటించిన ఈ హీరో గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..
తెలుగులో బ్లాక్‌బాస్టర్ మువీ భాగమతి మువీ హీరో గుర్తున్నాడా? మలయాళ నటుడైన ఉన్ని ముకుందన్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. 22 సెప్టెంబర్ 1987న జన్మించిన ఉన్ని ముకుందన్ బర్త్‌డే ఈ రోజు..
Updated on: Sep 22, 2022 | 11:08 AM

తెలుగులో బ్లాక్‌బాస్టర్ మువీ భాగమతి మువీ హీరో గుర్తున్నాడా? మలయాళ నటుడైన ఉన్ని ముకుందన్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. 22 సెప్టెంబర్ 1987న జన్మించిన ఉన్ని ముకుందన్ బర్త్‌డే ఈ రోజు. తమిళ, మళయాళంలోనే కాకుండా పలు తెలుగు సినిమాల్లో కూడా ముకుందన్ నటించాడు.

ఉన్ని ముకుందన్ అసలు పేరు ఉన్నికృష్ణన్ ముకుందన్. ఐతే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరును ఉన్ని ముకుందన్‌గా మార్చుకున్నాడు.

నటుడు ఉన్ని ముకుందన్ 2011లో తమిళ చిత్రం సీడాన్‌తో తన సినీ కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో మంచి పాత్రలు పోషించి, అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు.

2012 బైసాఖ్ యాక్షన్ కామెడీ మువీ మల్లు సింగ్ సినిమా ద్వారా ముకుందన్ గుర్తింపు పొందాడు. మామాంగమ్ సినిమా కూడా పెద్ద హిట్ ఇచ్చింది.

ఇక 2018లో అనుష్క శెట్టి సరసన తమిళ-తెలుగు చిత్రం భాగమతిలో నటించి తెలుగు చిత్ర సీమలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక 2018లో అనుష్క శెట్టి సరసన తమిళ-తెలుగు చిత్రం భాగమతిలో నటించి తెలుగు చిత్ర సీమలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మువీ 'మలికప్పురం' షూటింగ్‌లో ఉన్ని ముకుందన్ బిజీగా ఉన్నాడు.




