GodFather: బాస్ ఈజ్ బ్యాక్.. 100కోట్ల మార్క్ రీచ్ అయిన మెగాస్టార్ “గాడ్ ఫాదర్”
దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించి అలరించారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన గాడ్ ఫాదర్ హడావిడే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించి అలరించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నయనతార నటించి అలరించారు. ఇక ఈ సినిమాలో సత్య దేవ్ , సునీల్ , సముద్రఖని, అనసూయ ఇతర ముఖ్యపాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ సినిమా తర్వాత.. సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.
ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టారు మెగాస్టార్. ఇక గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంది. నిజానికి ఒరిజినల్ కంటే ఈ సినిమా బాగుందని టాక్ వినిపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లు మార్క్ చేరిన గాడ్ ఫాదర్.. ఇప్పుడు 100కోట్ల మార్క్ ను అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు మెగా అభిమానులు.
ముఖ్యంగా క్లైమాక్స్‌లో చిరు, సల్మాన్ వచ్చే స్క్రీన్ అదిరిపోయిందంటున్నారు. ఇందులో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం కీలకపాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా ‘గాడ్ ఫాదర్’ ఆకట్టుకోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమానే కాకుండా ప్రస్తుతం చిరు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
Megastar @KChiruTweets‘s domination at the Box Office ?
HUMONGOUS BLOCKBUSTER #GodFather crosses 100 CR gross and going strong❤️?
Book your tickets now! –https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfather@BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev pic.twitter.com/40GWlz24Lk
— Konidela Pro Company (@KonidelaPro) October 9, 2022