Nayanthara: నయనతార- విగ్నేష్ శివన్ దంపతులకు కవలలు .. సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన
ఈ అమ్మడు ఇటీవలే మూడు ముళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ.
నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నయన్. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు నయన్.. అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెన్యుమరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు కూడా క్రియేట్ చేశారు నయన్. ఇక ఈ అమ్మడు ఇటీవలే మూడు ముళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ జంట పండంటి కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. నయన్ కవలలకు జన్మనించింది. ఈ విషయాన్నీ నయనతార, విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పండంటి మగబిడ్డలకు నయన్ జన్మనించింది. పిల్లల పాదాల ఫోటోలను ఈ ఇద్దరు సోషల్ మీడియా లో షేర్ చేశారు.. నయన్-నేను అమ్మ , నాన్న గా మారాము. మేము ఆశీర్వదించబడ్డాము. మాకు ట్విన్ బేబీ బాయ్స్.. మా ప్రార్థనలు, మా పెద్దల ఆశీర్వాదాలు అన్ని కలిపి మాకు ఇద్దరు శిశువుల రూపంలో దక్కాయి. మా కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి. ఉయిర్- ఉలగం. అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు విగ్నేష్ శివన్. అయితే ఈ జంట సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనిచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక పలువురు ప్రముఖులు నయన్-విఘ్నేష్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram