Unstoppable Season 2 Trailer: అన్‏స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి మరింత రంజుగా.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.

గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్‌

Unstoppable Season 2 Trailer: అన్‏స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి మరింత రంజుగా.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.
Unstoppable With Nbk Season
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 09, 2022 | 12:21 PM

హీరోగానే కాకుండా హోస్ట్‏గానూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో నందమూరి బాలకృష్ణకు సాటిలేరు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే షోతో నిరూపించారు బాలయ్య. ఎప్పుడూ యాక్షన్ చిత్రాలతో అలరించిన హీరో.. ఈ షోతో తనదైన స్టైల్‏తో యాంకరింగ్‏కు ఆపాదించారు. అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 1 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతిథులకు కేవలం ప్రశ్నలు మాత్రమే కాకుండా సెటైరికల్ కామెడీతో వారి నుంచి సున్నితంగా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు బాలయ్య. గతంలోనే సెన్సెషన్ క్రియేట్ చేసిన అన్‌స్టాపబుల్‌ సీజన్ 1 ఇప్పుడు సీజన్ 2 రాబోతుంది. ఇటీవల ఈ షోకు సంబంధించిన టీజర్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఆదివారం మధ్యాహ్నం ఈషో ట్రైలర్ రిలీజ్ చేసింది ఆహా.

అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఇక ట్రైలర్‏లో నిధిని అన్వేషిస్తూ గుహలోకి వెళ్తారు బాలయ్య. అక్కడ ఎన్నో సవాల్లు.. అడ్డంకులు ఎదుర్కొని.. చివరకు నిధిని చేరుకుంటారు. అక్కడ ఉన్న ఓ బాక్స్ ఓపెన్ చేయగానే.. అందులో ఓ ఖడ్గం లభిస్తుంది. అది చేతపట్టుకుని “గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్‌”.. ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్.. ఈసారి మీకోసం మరింత రంజుగా అంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ఇక ట్రైలర్‏తోనే షోపై అంచనాలు పెంచేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

ఇదిలా ఉంటే.. అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 మొదటి అతిథి మాజీ సీఎం..తెలుగుదేశం అధినేత చంద్రబాబు రానున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి చంద్రబాబు టాక్ షోకు రావడంతో అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.