Ponniyin Selvan collections Day 9: బాక్సాఫీస్ వద్ద గెలిచిన మణిరత్నం.. పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే..

భారీ బడ్జెట్‏తో నిర్మించిన ఈ మూవీలో ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, కార్తి, చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలు పోషించారు. చోళ రాజుల కాలంలో జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించారు డైరెక్టర్ మణి.

Ponniyin Selvan collections Day 9: బాక్సాఫీస్ వద్ద గెలిచిన మణిరత్నం.. పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే..
Ponniyin Selvan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 09, 2022 | 8:57 AM

డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. భారీ బడ్జెట్‏తో నిర్మించిన ఈ మూవీలో ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, కార్తి, చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలు పోషించారు. చోళ రాజుల కాలంలో జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించారు డైరెక్టర్ మణి. గత తొమ్మిది రోజులుగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబడుతూ.. రూ. 350 కోట్ల మార్క్‏కు చేరువయ్యింది. ఇక ఈ వీకెండ్ లో ఈ చిత్రం ఈ మార్కును కూడా అధిగమించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు మేకర్స్. పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ వారాంతం నాటికి పొన్నియన్ సెల్వన్ ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు దాటే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో దీపావళి వరకు ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు మణి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

తమిళంలో ఈసినిమాకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుంది. విక్రమ్, కోబ్రా మూవీ తర్వాత భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాను పూర్తిగా రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు డైరెక్టర్ మణిరత్నం. త్వరలోనే సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌