Bigg Boss 6 Telugu: నేను అట్టర్ ప్లాప్.. స్వయంగా ఒప్పేసుకున్న చంటి.. నాగార్జున ముందే అలా..
కెప్టెన్ ముందు కమ్యునికేట్ చేసి.. ఆ తర్వాత విషయం చెప్పాలని అన్నారు. కెప్టెన్ అనేవాడు కాన్ఫ్లిక్ట్ క్లియర్ చేయాలని.. కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయకూడదన్నారు. ఇక చివరగా..కెప్టెన్ గా రూల్స్ బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నావని చెప్పారు.
బిగ్ బాస్ 6 తెలుగు ఇంటి నుంచి మరోకరిని ఎలిమినేట్ చేసే సమయం దగ్గరపడింది. శనివారం నాటి ఎపిసోడ్లో హౌస్మేట్స్ ఒక్కొక్కరికి క్లాస్ తీసుకున్నారు నాగార్జున. కెప్టెన్ రేవంత్.. కీర్తి, గీతూ ఇలా ఈవారం ఇంట్లో రచ్చ చేసినవారికి చురకలు అంటించారు. నువ్వు కెప్టెన్ కాగానే రూల్స్ గుర్తుకు వచ్చాయా ? అంటూ కెప్టెన్ రేవంత్ కు క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత రేవంత్ విషయంలో ఆడియన్స్ అభిప్రాయాన్ని తీసుకున్నారు. కెప్టెన్ ముందు కమ్యునికేట్ చేసి.. ఆ తర్వాత విషయం చెప్పాలని అన్నారు. కెప్టెన్ అనేవాడు కాన్ఫ్లిక్ట్ క్లియర్ చేయాలని.. కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయకూడదన్నారు. ఇక చివరగా..కెప్టెన్ గా రూల్స్ బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నావని చెప్పారు.
ఇక గతవారం కెప్టెన్ అయిన కీర్తికి కూడా చురకలు వేశారు. ముందుగా ఆమె కెప్టెన్సీ పై ఆదిరెడ్డిని రివ్యూ అడగ్గా.. అంతబాగానే చేసింది కానీ.. కెప్టెన్సీ కంటెండర్స్ విషయంలో నచ్చలేదన్నారు. రాజ్ కాకుండా.. ఇనయ, శ్రీహాన్లో ఒకరిని సెలక్ట్ చేయాల్సిందని చెప్పారు. అతడికి నాగార్జున మద్దతు ఇస్తూ.. నీకు రాజ్ మాత్రమే కనిపించాడా ? వీరిద్దరు కనిపించలేదా ? అని అడిగారు. తన కళ్లకు కనిపించింది అది చేశా అని సమాధానమిచ్చింది కీర్తి.
ఇక ఎవరు హిట్.. ఎవరు ప్లాప్ అనే టాస్కు ఇచ్చారు నాగార్జున. ముందుగా ఇయన, సూర్య ఇద్దరు రాగా.. వారిలో ఇనయ ప్లాపు, సూర్య హిట్ అని తేల్చేశారు. ఆ తర్వాత గీతూ.. ఆది రెడ్డి రగా.. వారిలో గీతూ ప్లాప్ అని.. ఆదిరెడ్డి హిట్ అన్నారు హౌస్మేట్స్. చివరగా.. చంటి, సుదీప బోనులోకి వచ్చారు. సుదీప మాట్లాడుతూ…అందర్నీ కలుపుకుపోతున్న తాను హిట్.. ఎవరినీ కలుపుకోలేకపోతున్న చంటి ప్లాప్ అని చెప్పింది. చంటి కూడా తాను ప్లాప్ అని ఒప్పేసుకున్నాడు . దీంతో అందరూ సుదీపకు మద్దతు ఇచ్చారు.