Bigg Boss 6 Telugu: కెప్టెన్ రేవంత్ పై నాగార్జున ఫైర్.. ఇష్టం లేకుండా ముద్దు పెట్టడం తప్పు అంటూ..

కెప్టెన్ కీర్తి కంటెండర్ సెలక్షన్ సరిగ్గా లేదంటూ చురకలు అంటించారు. అయితే రేవంత్ కెప్టెన్ అయిన తర్వాత ఇంట్లో రూల్స్ పూర్తిగా మారిపోయాయి. బిగ్ బాస్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలంటూ చెప్పేసాడు రేవంత్.

Bigg Boss 6 Telugu: కెప్టెన్ రేవంత్ పై నాగార్జున ఫైర్.. ఇష్టం లేకుండా ముద్దు పెట్టడం తప్పు అంటూ..
Bigg Boss Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 09, 2022 | 1:43 PM

బిగ్ బాస్ సీజన్ 6 ఈ వారం మొత్తం ఇంట్లో బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఎవరి పెర్ఫైమెన్స్‏తో వారు ప్రేక్షకులను, ఆడియన్స్‏కు ఆకట్టుకునేందుకు తెగ తంటాలు పడ్డారు. తనకు రేవంత్ ముద్దు పెట్టడం ఇష్టం లేదని సూటిగా చెప్పేసింది గీతూ. ఇక ఇదే విషయంపై నాగార్జున కెప్టెన్ రేవంత్‏కు క్లాస్ తీసుకున్నారు. ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా ముద్దు పెట్టడం తప్పు.. అలా చేయవద్దు అంటూ సీరియస్ అయ్యారు. శనివారం నాటి ఎపిసోడ్‏లో మరోసారి ఇంటి సభ్యులపై అక్షింతలు వేశారు నాగ్. కెప్టెన్ కీర్తి కంటెండర్ సెలక్షన్ సరిగ్గా లేదంటూ చురకలు అంటించారు. అయితే రేవంత్ కెప్టెన్ అయిన తర్వాత ఇంట్లో రూల్స్ పూర్తిగా మారిపోయాయి. బిగ్ బాస్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలంటూ చెప్పేసాడు రేవంత్. దీంతో అతని కెప్టెన్సీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు హౌస్మేట్స్.

కెప్టెన్ అయిన తర్వాతే నీకు రూల్స్ గుర్తుకు వచ్చాయా ? అంటూ ముఖం మీదే అడిగేసింది శ్రీసత్య. అందరూ రూల్స్ ఫాలో అవుతున్నారా ? అంటూ కడిగిపడేసింది. అయితే వీరిద్దరి మధ్య చర్చ జరుగుతుంటే.. అర్జున్ కళ్యాణ్ మధ్యలోకి వచ్చేశాడు. దీంతో మధ్యలోకి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు రేవంత్. శనివారం నాటి ఎపిసోడ్‎లో హోస్ట్ నాగార్జున కూడా మరోసారి ముద్దు గొడవ గురించి మాట్లాడాడు. ఈ విషయంలో రేవంత్ కు కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. నువ్వు కెప్టెన్ అయిన తర్వాతే రూల్స్ గుర్తుకు వస్తాయా ? అని అడిగారు. దీనిపై ఆడియన్స్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. కెప్టెన్ ముందు కమ్యునికేట్ చేసి.. ఆ తర్వాత విషయం చెప్పాలని సెటైర్ వేశారు. ఇక ఇంట్లో జెండర్ డిఫరెన్స్ లేదని.. కానీ ఎవరికి వాళ్ల పర్సవల్ స్పేస్ ఉంటుందన్నారు. వాళ్లు వ్యక్తిగతంగా కంఫర్టబుల్ గా లేనప్పుడు ముద్దుపెట్టడం తప్పు అని.. గీతుకు ముద్దు పెడితే చిరాకని.. కానీ ఆట ఆడేటప్పుడు ఎక్కడ దాచినా లాక్కోవచ్చని చెప్పింది. అంటే ఆ విషయం చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది. ఇతరుల పర్సనల్ స్పేస్ అర్థం చేసుకోవాలని సూచించారు నాగార్జున. మొత్తానికి ఈ వారంలో ముద్దు రచ్చ ఎక్కువగానే సాగింది.