AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: ఊహించినట్లుగానే.. బిగ్‌బాస్‌ నుంచి చలాకీ చంటి ఔట్.. హౌస్‌మేట్స్‌పై హాట్ కామెంట్స్

ఈవారం నామినేషన్స్‌ లిస్టులో ఇనయా, చంటి, అర్జున్, మరీనా ఉండగా మొదటి రౌండ్‌లో అర్జున్‌, మరీనా సేఫ్‌ అయ్యారు. చివరగా నామినేషన్‌లో ఇనయ, చంటి ఉండగా ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠ నెలకొంది.

Bigg Boss 6 Telugu: ఊహించినట్లుగానే.. బిగ్‌బాస్‌ నుంచి చలాకీ చంటి ఔట్.. హౌస్‌మేట్స్‌పై హాట్ కామెంట్స్
Bigg Boss 6 Telugu
Basha Shek
|

Updated on: Oct 10, 2022 | 6:40 AM

Share

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు-6 ఐదో వారం పూర్తయింది. ప్రతివారం లాగే ఈ సారి కూడా ఒకరు బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటికొచ్చారు. ఈ వారం చలాకీ చంటి ఎలిమినేట్‌ అవుతాడని ముందుగానే సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అనుకున్నట్లే అతనే హౌస్‌ నుంచి బయటికొచ్చేశాడు. అయితే ఎలిమినేషన్‌ మాత్రం చివరివరకు ఉత్కంఠగా సాగింది. ఈవారం నామినేషన్స్‌ లిస్టులో ఇనయా, చంటి, అర్జున్, మరీనా ఉండగా మొదటి రౌండ్‌లో అర్జున్‌, మరీనా సేఫ్‌ అయ్యారు. చివరగా నామినేషన్‌లో ఇనయ, చంటి ఉండగా ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠ నెలకొంది. అంతిమంగా ఊహించినట్టే చంటి ఎలిమినేట్‌ అయ్యాడు. కాగా చంటి ఎలిమినేట్‌ అని ప్రకటించగానే ఇనయ కన్నీరుమున్నీరుగా ఏడ్చేసింది. ప్లీజ్‌ చంటిగారు, నేనే వెళ్లిపోతానంటూ శోకమందుకుంది.

అతని మంచితనం మేకప్‌..

ఈ సందర్భంగా వెళ్తూ వెళ్తూ చంటి ఇంటి సభ్యులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హోస్ట్‌ నాగార్జున రిపోర్ట్ కార్డ్ రూపంలో హౌస్‌మేట్స్‌కు మార్కులు వేయాలని చెప్పగా, అర్జున్‌, సుదీప, రోహిత్, రాజ్‌, కీర్తిలకు ఫెయిల్‌ మార్కులు వేశాడు. అర్జున్‌ గేమ్‌ ఆడుతున్నాడు, కానీ ఎక్కడో రాజీపడుతున్నాడన్నాడు.ఇక సుదీపకి వంటగదిలోనే టైమ్‌ సరిపోతుందని, గేమ్‌లకు సమయం ఉండటం లేదని, కిచెన్‌ నుంచి బయటకు రావాలని సూచించాడు. రోహిత్.. తనలాగే ఉన్నాడని, తాను చేసిన తప్పు చేయోద్దన్నారు. రాజ్‌ అందరిని నమ్ముతాడని, తాను అనుకున్నది సరిగా ఎక్స్ ప్రెస్‌ చేయలేకపోతున్నాడని చెప్పాడు. కీర్తికి తన గతాన్ని తీసి గేమ్‌ ఆడాలని చెప్పాడు. ఇక సూర్య, శ్రీహాన్‌, ఫైమా, మరీనా, రేవంత్‌లకు టాప్‌ మార్కులిచ్చాడు చంటి. ఆర్జే సూర్య అందరినీ ఎక్కువగా ప్రేమిస్తుంటాడని, అది మానేసి ఆట ఆడాలన్నారు. శ్రీహాన్‌ చాలా క్లారిటీ ఉన్న కంటెస్టెంట్‌ అని, ఫైమా అందరిని నవ్విస్తుందని చెప్పాడు. మరీనా మదర్ ఇండియా అని, ఆమె ప్రాబ్లెమ్‌ రోహిత్‌ అని తెలిపాడు. రేవంత్‌ కోపం, ఆవేశం, గారాబం ఎక్కువ అని తెలిపారు. ఇక మిగితా వారిలో ఇనయకి ఆయన వంద మార్కులు వేయడం విశేషం. ఆదిరెడ్డి, గీతూలకు 90మార్కులిచ్చాడు. గీతూ, రేవంత్‌, కీర్తిలకు సలహాలిస్తూ, కాగా బాలాదిత్యపై మంచితనం మేకప్‌ అని చెప్పి సంచలనానికి తెరతీశాడు చంటి.

ఇక అంతకు ముందు షోకి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ గెస్ట్ గా వచ్చాడు. ఆయన పాటతోనే నాగ్‌ ఎంట్రీ ఇవ్వడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్‌ రూపొందించిన పాన్‌ ఇండియా పాప్‌ సాంగ్ ని బిగ్‌ బాస్‌ షోలో ఆవిష్కరించారు. అనంతరం హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!