Suriya: ఏం క్రేజ్ బాసూ.. మోషన్ పోస్టర్ తో వందకోట్ల డీల్ సెట్ చేసిన సూర్య సినిమా..

గజినీ సినిమా మన దగ్గర ఏ రేంజ్ కి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సూర్య విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.

Suriya: ఏం క్రేజ్ బాసూ.. మోషన్ పోస్టర్ తో వందకోట్ల డీల్ సెట్ చేసిన సూర్య సినిమా..
Surya
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2022 | 8:29 PM

తమిళ్ స్టార్ హీరో సూర్య కు తెలుగులో కుడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే సూర్య నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన సినిమాలకు ఇక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. గజినీ సినిమా మన దగ్గర ఏ రేంజ్ కి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సూర్య విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలో మరపురాని పాత్రలో మెప్పించారు సూర్య. సూర్య సినిమా వస్తుందంటే తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఓ ఆసక్తి ఉంటుంది. ఇక సూర్య ప్రయోగాలకు పెట్టింది పేరు. గజినీ నుంచి మొన్నీమధ్య వచ్చిన 24 సినిమా వరకు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి మెప్పించారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.

సూర్య ప్రస్తుతం బాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బాల తో కలిసి సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శివ దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఒక మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.  ఈ సినిమా డిజిటల్ డీల్ పూర్తయినట్టుగా చెబుతున్నారు. సూర్య సినిమాకు ఏకంగా 100 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను 100 కోట్లకు సొంతం చేసుకుందనేదని టాక్ వినిపిస్తోంది. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.. ‘ఆకాశం నీ హద్దురా’ .. ‘జై భీమ్’ సినిమాలు  ఓటీటీలో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దాంతో సూర్య సినిమాలకి ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఆ కారణంగానే ఈ సినిమాకు 100కోట్ల డీల్ సెట్ అయ్యిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.