Surekha Vani: ‘సినిమాలు చేయాలనే ఉంది.. కానీ అవకాశాలే రావట్లేదు’.. స్టేజ్ పైనే ఎమోషనల్ అయిన సురేఖ వాణి..

చాలా మంది సురేఖ వాణి ఎందుకని సినిమాలు చేయట్లేదు అంటున్నారు. అసలు మావరకు అవకాశాలు వస్తే కదా చేయడానికి.. నేను సినిమా అమ్మాయిని.. ఎప్పటికీ మూవీస్ చేస్తూనే ఉంటాను అంటూ భావోద్వేగ కామెంట్స్ చేశారు.

Surekha Vani: 'సినిమాలు చేయాలనే ఉంది.. కానీ అవకాశాలే రావట్లేదు'.. స్టేజ్ పైనే ఎమోషనల్ అయిన సురేఖ వాణి..
Surekha Vani
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 08, 2022 | 1:03 PM

యంగ్ హీరో బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం స్వాతిముత్యం. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన ఈ సినిమాతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం తాజాగా హైదరాబాద్‏లో ఘనంగా విజయోత్సవ వేడుకకు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గోన్న నటి సురేఖా వాణి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. చాలా మంది సురేఖ వాణి ఎందుకని సినిమాలు చేయట్లేదు అంటున్నారు. అసలు మావరకు అవకాశాలు వస్తే కదా చేయడానికి.. నేను సినిమా అమ్మాయిని.. ఎప్పటికీ మూవీస్ చేస్తూనే ఉంటాను అంటూ భావోద్వేగ కామెంట్స్ చేశారు.

సురేఖా వాణి మాట్లాడుతూ.. “నన్ను చాలామంది ఎక్కువ సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఇలాంటి పాత్రలు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. అవకాశమొస్తే ఎందుకు చేయను. దర్శకుడు లక్ష్మణ్ మొదటిసారి నన్ను కలిసి ఈ సినిమాలో నా పాత్ర గురించి నాకు చెప్పినప్పుడు.. నిజంగానే ఈ పాత్ర కోసం మొదట నన్నే అనుకున్నారా అని అడిగాను. ఎందుకంటే ఇలాంటి పాత్రలు మా వరకూ రావట్లేదు. వస్తే తప్పకుండా చేస్తాం. నేను సినిమాలు మానేశాను అని కొందరు అనుకుంటున్నారు. నేను సినిమా అమ్మాయిని, ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాను.

ఇవి కూడా చదవండి

నాకు ఇంతమంచి పాత్ర ఇచ్చిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇక మా అబ్బాయి గణేష్ నిజంగానే బంగారు కొండ. మొదటి సినిమానే ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉంది. అలాగే దర్శకుడు లక్ష్మణ్ గారు ఇంకా ఎన్నో ఇలాంటి మంచి సినిమాలు తీయాలని, మా లాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.