Adipurush: ఆదిపురుష్ కోసం ప్రభాస్‏ను అందుకే సెలెక్ట్ చేసుకున్నాడట.. ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్..

ఆదిపురుష్ సినిమా కోసం బాలీవుడ్ హీరోలను కాదని ప్రభాస్‏ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం పై వివరణ ఇచ్చారు డైరెక్టర్ ఓంరౌత్. ప్రభాస్ లేకుండా ఈ సినిమా వచ్చేది కాదన్నారు.

Adipurush: ఆదిపురుష్ కోసం ప్రభాస్‏ను అందుకే సెలెక్ట్ చేసుకున్నాడట.. ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్..
Om Raut, Prabhas
Follow us

|

Updated on: Oct 08, 2022 | 8:21 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‏లో అతి పెద్ద చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్సిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‏తోపాటు టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే ఈ టీజర్ పై ముందు నుంచి విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ప్రభాస్ లుక్స్.. సైఫ్ అలీ ఖాన్ రోల్ లుక్ పై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. తాము ఆశించినంతగా టీజర్ లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండే.. ఆదిపురుష్ సినిమా కోసం బాలీవుడ్ హీరోలను కాదని ప్రభాస్‏ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం పై వివరణ ఇచ్చారు డైరెక్టర్ ఓంరౌత్. ప్రభాస్ లేకుండా ఈ సినిమా వచ్చేది కాదన్నారు. ” నేను ఈ కథ రాస్తున్నప్పుడు.. ముఖ్యంగా రాముడి పాత్ర గురించి రాసేటప్పుడు నా మనసులో కేవలం ప్రభాస్ మాత్రమే ఉండేవాడు. అది నాకు చాలా కంఫర్ట్‏బుల్ గా అనిపించింది. ఒకవేళ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకోకపోతే.. అప్పుడు ఆదిపురుష్ సినిమా వచ్చేది కాదు. అతను పోషించిన పాత్ర చాలా ప్రత్యేకంగా, దైవికంగా ఉంటుంది. ” అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ ఓంరౌత్.

రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఈ సినిమానే కాకుండా.. డార్లింగ్ చేతిలో సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలున్నాయి.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు