AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

God Father: గాడ్ ఫాదర్ జోరు.. అక్కడ సూపర్ రెస్పాన్స్.. ఏకంగా 600 థియేటర్లు పెంపు..

తెలుగులోనే కాకుండా హిందీలోనూ గాడ్ ఫాదర్ జోరు కొనసాగుతుంది. ఉత్తరాదిలోనూ ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. నార్త్ ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని చిత్రయూనిట్ మరో అడుగు ముందుకు వేసింది.

God Father: గాడ్ ఫాదర్ జోరు.. అక్కడ సూపర్ రెస్పాన్స్.. ఏకంగా 600 థియేటర్లు పెంపు..
Godfather Movie
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2022 | 12:48 PM

Share

దసరా కానుకగా గాడ్ ఫాదర్ చిత్రంలో థియేటర్లలో సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు చిరు. మలయాళం హిట్ చిత్రం లూసీఫర్ రీమేక్‏గా వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా మార్పులు చేశారు డైరెక్టర్ మోహన్ రాజా. అంతేకాకుండా ఇందులో నయనతార, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించడం సినిమాకు మరో హైలెట్ అయ్యింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లకు చేరువలో ఉంది గాడ్ ఫాదర్ చిత్రం. ఇక వీకెండ్ కావడంతో.. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ గాడ్ ఫాదర్ జోరు కొనసాగుతుంది. ఉత్తరాదిలోనూ ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. నార్త్ ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని చిత్రయూనిట్ మరో అడుగు ముందుకు వేసింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా హిందీ వెర్షన్‍కు శనివారం నుంచి మరో 600 స్క్రీన్స్ పెంచినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరు ఓ స్పెషల్ వీడియోల్ రిలీజ్ చేశారు. గాడ్ ఫాదర్ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. విడుదలైన రెండురోజుల్లోనే మీ సినిమా రూ. 69 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినందుకు చాలా సంతోషం. హిందీ బెల్డ్ లో మరో 600 స్క్రీన్స్ పెంచుతున్నాం. మా సినిమాను పాన్ ఇండియా మూవీగా చేసినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు చిరు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా.. సత్యేదేవ్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..