Nayanthara - Vignesh Shivan: నయనతారకి కవల పిల్లలు.. ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విఘ్నేష్..(వీడియో)

Nayanthara – Vignesh Shivan: నయనతారకి కవల పిల్లలు.. ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విఘ్నేష్..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 09, 2022 | 7:41 PM

నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నయన్. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు నయన్.


లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే మూడు ముళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.ఈ జంట పండంటి కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. నయన్ కవలలకు జన్మనించింది. ఈ విషయాన్నీ నయనతార, విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పండంటి మగబిడ్డలకు నయన్ జన్మనించింది. పిల్లల పాదాల ఫోటోలను ఈ ఇద్దరు సోషల్ మీడియా లో షేర్ చేశారు.. నయన్-నేను అమ్మ , నాన్న గా మారాము. మేము ఆశీర్వదించబడ్డాము. మాకు ట్విన్ బేబీ బాయ్స్.. మా ప్రార్థనలు, మా పెద్దల ఆశీర్వాదాలు అన్ని కలిపి మాకు ఇద్దరు శిశువుల రూపంలో దక్కాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 09, 2022 07:41 PM