Megastar Chiranjeevi: ‘మహానటి’ ముందు జాగ్రత్తగా ఉండకపోతే తినేస్తుంది.. కీర్తిపై చిరు ఫన్నీ కామెంట్స్..
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించగా.. కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను కీలకపాత్రలలో నటించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించగా.. ఇప్పటివరకు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మాత్రం సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఇక ఇందులో చిరు పూర్తిగా వింటెజ్ లుక్ లో కనిపించనున్నారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోన్న చిత్రం భోళా శంకర్. డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించగా.. కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను కీలకపాత్రలలో నటించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించగా.. ఇప్పటివరకు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మాత్రం సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఇక ఇందులో చిరు పూర్తిగా వింటెజ్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే మరోసారి తన ఎనర్జీ డాన్స్ లు.. కామెడీ టైమింగ్ తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 11న అడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రస్తుతం చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.
ఈ క్రమంలోనే భోళా శంకర్ టీమ్ మొత్తం ఓ ఇంటర్వ్యూ నిర్వహించుకున్నారు. అందులో శ్రీముఖి, చిరంజీవి, కీర్తి, తమన్నా, గెటప్ శ్రీను, డైరెక్టర్ మెహర్ రమేశ్, సుశాంత్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో చిరు తన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించడమే కాదు.. కీర్తి గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు. కీర్తి ముందు జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే తినేస్తుందని అంటూ నవ్వులు పూయించారు.
చిరు మాట్లాడుతూ.. కీర్తి వాళ్ల మదర్ మేనక నాకు మంచి ఫ్రెండ్. అదే అనుబంధం కీర్తితో కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో చెల్లెలి సెంటిమెంట్ చాలా కొత్తగా..బలంగా ఉంటుంది. తన నటనతో కీర్తి నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లింది. ఇక కీర్తి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. తను మహానటి. తన ముందు జాగ్రత్తగా లేకపోతే తినిపారేస్తుంది. తమన్నాతో చేసే డాన్సులను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేసే సీన్ కూడా ఆకట్టుకుంటుంది. ఆ సందర్భాన్ని చాలా ఎంజాయ్ చేశాను. అంటూ చెప్పుకొచ్చారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




