Salaar: గూగుల్ మమ్మీ.. ఆన్సర్ చెప్పు ప్లీజ్.. ‘సలార్’ మీనింగ్ కోసం నెటిజన్స్ సెర్చింగ్..
తాజాగా సలార్ సినిమా పేరు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు జనాలు గూగుల్ లో సలార్ అంటే అర్థమేంటనీ సెర్చింగ్ మొదలుపెట్టేశారు. అసలు ప్రభాస్ మాస్ యాక్షన్ హీరోగా రాబోతున్న ఈ చిత్రానికి సలార్ అనే పేరును నీల్ ఎందుకు పెట్టారు.. ఇంతకీ సలార్ అంటే అర్థమేంటీ ?.. అని సెర్చ్ చేస్తున్నారు. మరీ మీకు తెలుసా సలార్ అంటే ఏంటో ?.. దాని అర్థం ఏంటంటే..
సలార్.. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. ఈ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ సినిమాలతో సెన్సెషన్ క్రియేట్ చేసిన నీల్.. ఇప్పుడు సలార్ మూవీతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో తెలుసుకోవడానికి సినీప్రియులు వెయిట్ చేస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత పూర్తి స్థాయిలో మాస్ యాక్షన్ మూవీలో నటిస్తోండడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. భారీ బడ్జెట్తో హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈమూవీలో శ్రుతి హాసన్, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, విలక్షణ నటుడు జగపతి బాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. ప్రభాస్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు.
తాజాగా సలార్ సినిమా పేరు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు జనాలు గూగుల్ లో సలార్ అంటే అర్థమేంటనీ సెర్చింగ్ మొదలుపెట్టేశారు. అసలు ప్రభాస్ మాస్ యాక్షన్ హీరోగా రాబోతున్న ఈ చిత్రానికి సలార్ అనే పేరును నీల్ ఎందుకు పెట్టారు.. ఇంతకీ సలార్ అంటే అర్థమేంటీ ?.. అని సెర్చ్ చేస్తున్నారు. మరీ మీకు తెలుసా సలార్ అంటే ఏంటో ?.. దాని అర్థం ఏంటంటే.. నాయకుడు.. కమాండర్ లేదా యోధుడు. ప్రతి ఒక్కరినీ నడిపించేవాడు.. రక్షకుడు అని అర్థం. ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా థీమ్ కూడా అదే. అందుకే ఈ సినిమాకు సలార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు నీల్. తన ప్రజలను కాపాడుతూ.. ప్రతి కష్టానికి ముందుండి దారిచూపించే కమాండర్ లాగా ప్రభాస్ అండగా ఉంటాడు అని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నారు నీల్. ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచింది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలఖారున విడుదల కానుంది. తెలుగుతోపాటు.. కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషలలోనూ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు మేకర్స్.
The Dinosaur takes over @YouTubeIndia by storm ❤️🔥#SalaarTeaser hits a whooping 83 Million+ Views in 24 Hours!
▶️ https://t.co/KbTyFGPYCu#SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/EXJv2YLqqV
— Hombale Films (@hombalefilms) July 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.