Chiranjeevi: చిరంజీవి పుట్టిన రోజు.. పొర్లు దండాలతో తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్న వీరాభిమాని.. వీడియో

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే పలువురు అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మెగా బాస్ కు పుట్టిన రోజు విషెస్ చెబుతున్నారు. ఇక చాలా చోట్ల మెగాభిమానులు రక్తదానం, అన్నదానం నిర్వహించి మెగాస్టార్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే తిరుపతి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం చిరంజీవిపై వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నారు.

Chiranjeevi: చిరంజీవి పుట్టిన రోజు.. పొర్లు దండాలతో తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్న వీరాభిమాని.. వీడియో
Chiranjeevi Fan
Follow us
Basha Shek

|

Updated on: Aug 22, 2024 | 1:34 PM

మెగాస్టార్ చిరంజీవి గురువారం (ఆగస్టు 22) తన 69వ పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుట్టిన రోజున ఏడు కొండలస్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే పలువురు అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మెగా బాస్ కు పుట్టిన రోజు విషెస్ చెబుతున్నారు. ఇక చాలా చోట్ల మెగాభిమానులు రక్తదానం, అన్నదానం నిర్వహించి మెగాస్టార్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే తిరుపతి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం చిరంజీవిపై వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నారు. మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీవారి మెట్టు మార్గం గుండా పొర్లుదండాలు పెడుతూ తిరుమలకు చేరుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ చిరంజీవికి వీరాభిమాని. మెగాస్టార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ గత 21 ఏళ్లుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని మరోసారి శ్రీవారి మెట్టు మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత శ్రీవారి మెట్ల మార్గంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈశ్వర్ ఆ తర్వాత పొర్లు దండాలతో తిరుమలకు వెళ్లారు.

చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీవారిని కోరుకున్నారట ఈశ్వర్. అలాగే భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గా చూడాలనుకుంటున్నట్లు అతను ఆకాంక్షించాడు. ఈ యాత్రలో జనసేన పార్టీ నాయకులు, తదితరులు కూడా పాల్గొన్నారు ఈశ్వర్ రాయల్ క కావాల్సిన సహకారం అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.