AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Kapoor: అందుకే ఆ స్టార్ హీరోలతో నటించడం లేదు.. అసలు విషయం చెప్పేసిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 'ఖాన్' త్రయం ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమిర్‌ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇలా అందరూ తమ దైన ముద్ర వేశారు. వీరితో నటించే అవకాశం వస్తే దాదాపు ఏ నటి నో చెప్పదు. ఈ సూపర్‌స్టార్‌లతో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది.

Shraddha Kapoor: అందుకే ఆ స్టార్ హీరోలతో నటించడం లేదు.. అసలు విషయం చెప్పేసిన స్టార్ హీరోయిన్
Shraddha Kapoor
Basha Shek
|

Updated on: Aug 22, 2024 | 1:08 PM

Share

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ‘ఖాన్’ త్రయం ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమిర్‌ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇలా అందరూ తమ దైన ముద్ర వేశారు. వీరితో నటించే అవకాశం వస్తే దాదాపు ఏ నటి నో చెప్పదు. ఈ సూపర్‌స్టార్‌లతో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది. అయితే బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరైన శ్రద్ధా కపూర్ ఇప్పటి వరకు ఒక్క ఖాన్ సినిమాలో నటించలేదు. అందుకు కారణాన్ని ఇప్పుడు బయటపెట్టిందీ అందాల తార. ‘స్త్రీ 2’ సినిమాతో శ్రద్ధా కపూర్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ అందాల తార బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి చాలా ఏళ్లు గడిచాయి. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవల శ్రద్ధ ప్రధాన పాత్రలో నటించిన లైన ‘స్త్రీ 2’ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ గా ఈ సినిమా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూకు ఇచ్చింది శ్రద్ధా కపూర్. స్త్రీ2 సినిమా ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగానే స్టార్ హీరోలతో నటించకపోవడానికి గల కారణాలను వెల్లడించింది.

‘స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కంటే నా క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నాకు ముఖ్యం. గతంలో ఆఫర్లు వచ్చినప్పుడు నా పాత్రకు ప్రాధాన్యం లేదని చాలా సినిమాలు తిరస్కరించాను. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో ఎందుకు సినిమా తీయలేదంటే ఇదే నా సమాధానం. సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. మనలోని ఆర్టిస్ట్‌కు ఆ పాత్ర సరిపోతుందా? సవాలుగ ఉంటుందా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటాను. లేకపోతే ఆ సినిమాలను వదిలేస్తాను’ అని శ్రద్ధా కపూర్ చెప్పుకొచ్చింది. కాగా స్త్రీ2 సినిమా విజయంలో శ్రద్ధా కపూర్ కు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. ఆమెకు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 9.14 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న ‘స్త్రీ 2’ సినిమా ఇప్పటికే రూ. 300 కోట్లు రాబట్టింది. 2018లో విడుదలైన ‘స్త్రీ సినిమాకు సీక్వెల్ ఇది. శ్రద్ధా కపూర్ తో పాటు రాజ్‌కుమార్ రావ్, అభిషేక్ బెనర్జీ, తమన్నా భాటియా, వరుణ్ ధావన్, పంకజ్ త్రిపాఠి వంటి నటీనటులు ఈ సినిమాలో నటించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

వరుణ్ ధావన్ తో శ్రద్ధా కపూర్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Maddock Films (@maddockfilms) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

శ్రద్ధా కపూర్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.