Sreeja Konidela: ‘కొత్త ప్రయాణం మొదలైంది’.. గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు అందరూ సినిమా ఇండస్ట్రీతో ఏదో ఒక రకంగా సంబంధమున్నవారే. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. అయితే చిన్న కూతురు శ్రీజ కొణిదెల మాత్రం చాలా డిఫరెంట్. సినిమా ఇండస్ట్రీకి ఆమె చాలా దూరంగా ఉంటుంది.

Sreeja Konidela: 'కొత్త ప్రయాణం మొదలైంది'.. గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల
Sreeja Konidela
Follow us
Basha Shek

|

Updated on: Apr 21, 2024 | 6:54 PM

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు అందరూ సినిమా ఇండస్ట్రీతో ఏదో ఒక రకంగా సంబంధమున్నవారే. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. అయితే చిన్న కూతురు శ్రీజ కొణిదెల మాత్రం చాలా డిఫరెంట్. సినిమా ఇండస్ట్రీకి ఆమె చాలా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవితోనే తన పిల్లలతో కలిసి ఉంటోన్న ఈ మెగా డాటర్.. ఇప్పుడు కొత్తగా బిజినెస్ లోకి అడుగు పెట్టింది. దీనికి సంబంధించి ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది శ్రీజ. ఇంతకీ ఆమె ఏ వ్యాపారంలోకి అడుగుపెట్టిందో తెలుసా? హైదరాబాద్ లో స్టూడియో అనంత పేరుతో ఒక ఫిట్ నెస్ సెంటర్ ను ప్రారంభించింది శ్రీజ.  ఇందులో మనసుకు, శరీరానికి ప్రశాంతత  కలిగించేలా జిమ్, యోగా, ఇతరత్రా కార్యక్రమాలన్నీ ఉంటాయట. ఓపెనింగ్ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కాసాండ్రా, బాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్ శిల్పాశెట్టి ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లో తను కూడా భాగమైనందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉందని శ్రీజ తన ఇన్ స్టాలో స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. ఈ సెంటర్‌లో జిమ్, యోగా లాంటివి ఉంటాయని తెలుస్తోంది. తనకు తెలిసిన కొంత మందితో ఈ ఫిట్ నెస్ స్టూడియోను శ్రీజ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sreeja (@sreejakonidela)

పిల్లలతోనే గడిపేస్తోన్న శ్రీజ కొణిదెల..

ఇదిలా ఉంటే శ్రీజ ప్రస్తుతం తన పిల్లలు నివృతి, నవిష్కలతోనే జీవిస్తోంది. హీరో కల్యాణ్ దేవ్, శ్రీజల మధ్య రిలేషన్ షిప్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు. వీరిద్దరు విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్కరు కూడా అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు.

మరోవైపు శ్రీజ, కల్యాణ్‌ దేవ్ విడివిడిగా ఉండి సుమారు రెండేళ్లకు పైగానే అయింది. అయితే తన కూతుళ్లతో మాత్రం అప్పుడప్పుడూ కనిపిస్తుంటాడు కల్యాణ్ దేవ్.

View this post on Instagram

A post shared by Sreeja (@sreejakonidela)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.