Manmadhudu: తెలుగులోకి మన్మథుడు హీరోయిన్ రీఎంట్రీ.. ఆ యంగ్ హీరో మూవీలో అన్షు..
అమాయకమైన యాక్టింగ్.. అంతకు మించిన అందంతో అప్పట్లో కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర మూవీలోనూ నటించింది. అప్పట్లో అన్షుకు ఉన్న క్రేజ్‌కు టాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం ఖాయమనుకున్నారు. అన్షుకు మాత్రం సెకండ్ హీరోయిన్ ఆఫర్స్ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఉన్నట్లుండి ఇండస్ట్రీకి దూరమయ్యింది. పెళ్లి తర్వాత ఫ్యామిలీకే ఎక్కువగా టైమ్ కేటాయించిన అన్షు.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
![Manmadhudu: తెలుగులోకి మన్మథుడు హీరోయిన్ రీఎంట్రీ.. ఆ యంగ్ హీరో మూవీలో అన్షు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/anshu.jpg?w=1280)
తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ తొలి చిత్రానికే స్టార్ డమ్ అందుకున్నారు. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్నారు. అందులో అన్షు ఒకరు. ఈ పేరు చెబితే జనాలు గుర్తుపట్టడం కష్టమే. కానీ మన్మథుడు మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. తొలి చిత్రమే అయినా.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అమాయకమైన యాక్టింగ్.. అంతకు మించిన అందంతో అప్పట్లో కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర మూవీలోనూ నటించింది. అప్పట్లో అన్షుకు ఉన్న క్రేజ్‌కు టాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం ఖాయమనుకున్నారు. అన్షుకు మాత్రం సెకండ్ హీరోయిన్ ఆఫర్స్ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఉన్నట్లుండి ఇండస్ట్రీకి దూరమయ్యింది. పెళ్లి తర్వాత ఫ్యామిలీకే ఎక్కువగా టైమ్ కేటాయించిన అన్షు.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
తాజాగా అన్షుకు తెలుగులో ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ధమాకా డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. SK30 వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో అన్షును తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన నరేషన్ కూడా కంప్లీట్ అయ్యిందని.. ఈ సినిమాతో అన్షు రీఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఇదే నిజమైతే దాదాపు 20 సంవత్సరాల తర్వాత అన్షు మళ్లీ వెండితెరపై కనిపించనుందని తెలుస్తోంది.
మన్మథుడు సినిమాలో అన్షు… నాగ్ కెమిస్ట్రీ అడియన్స్ కు తెగ నచ్చేసింది. చాలా కాలం తర్వాత వీరిద్దరు కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం…ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా మరోసారి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సునీల్, సోనాలీ బింద్రె కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమయంలోనే 2003లో సచిన్ సగ్గర్ ను వివాహం చేసుకుని లండన్ లో సెటిల్ అయ్యింది అన్షు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. సోషల్ మీడియాలో అన్షు చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన ఫోటోస్, ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.\
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.