AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ‘అన్నా’ అంటూ మంచు విష్ణు వీడియోను షేర్ చేసిన మంచు మనోజ్.. అన్నదమ్ములిద్దరూ కలిసిపోయినట్టేనా?

గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. కుటుంబ సమస్యలు ఏకంగా పోలీస్టేషన్‌ దాకా చేరడం, దాడుల వరకు వెళ్లడంతో మంచు అభిమానులు బాగా కలత చెందారు. అయితే ఇప్పుడు మంచు వారింట్లో అంతా సర్దుకున్నట్లే అనిపిస్తోంది.

Manchu Manoj: 'అన్నా' అంటూ మంచు విష్ణు వీడియోను షేర్ చేసిన మంచు మనోజ్.. అన్నదమ్ములిద్దరూ కలిసిపోయినట్టేనా?
Manchu Manoj, Manchu Vishnu
Basha Shek
|

Updated on: Aug 18, 2025 | 12:41 PM

Share

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా కొద్ దిరోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది.శివుని భక్తుడు భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ డివోషనల్ మూవీ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్‌ కూడా ఓ స్పెషల్ రోల్ లో కనిపించాడు. ఈ క్రమంలోనే కన్నప్పలో అవ్రామ్‌ నటనకు గాను సంతోషం ఫిల్మ్‌ అవార్డ్స్‌లో తాజాగా అవార్డు దక్కింది. ఈ అవార్డుల వేడుకకు మంచు విష్ణు-వెరానికా దంపతులతో పాటు మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. అవ్రామ్‌ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ.. మరోసారి మీ ముందుకు తప్పకుండా వస్తానని ఇందులో తెలిపాడు. అయితే మంచు విష్ణు షేర్ చేసిన వీడియోను మంచు మనోజ్ కూడా ట్విట్టర్ లో షేర్ చేశాడు. అంతేకాదు తన అన్నను ట్యాగ్ చేస్తూ .. ‘ అభినందనలు అవ్రామ్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎప్పటికీ ఇలాగే మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలి నాన్నా. ప్రత్యేకంగా నువ్వు విష్ణు అన్నతో పాటుగా నాన్నగారు మోహన్‌బాబుతో అవార్డు అందుకోవడం చాలా స్పెషల్‌..’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ను చూసిన మంచు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘రక్త సంబంధం అలాంటిది’.. ‘అన్నదమ్ములిద్దరూ కలిసి పోయినట్టే’ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా కన్నప్ప విడుదల సమయంలో కూడా సినిమా చూసిన మనోజ్‌ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ పెట్టాడు. సినిమా చాలా బాగుందని తాను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చిందని చెప్పాడు. కన్నప్పలో తన అన్న మంచు విష్ణు ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదని ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడు మరోసారి మంచు విష్ణు పేరు కోట్‌ చేస్తూ మనోజ్‌ పోస్ట్‌ పెట్టడంతో ‘భయ్యా.. అంతా సర్దుకున్నట్టే’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌
చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌
వీరికి ఆ బాధలు ఉండవ్..శని దేవుడే ఈ రాశులకు కొండంత అండ!
వీరికి ఆ బాధలు ఉండవ్..శని దేవుడే ఈ రాశులకు కొండంత అండ!