AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ‘నీవల్లే అంతా కలిసున్నాం.. నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా’.. తల్లికి మంచు మనోజ్ బర్త్ డే విషెస్

క్రమశిక్షణకు మారుపేరైన మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు టాలీవుడ్ తో పాటు రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఇంటి సమస్య కాస్తా రచ్చ కెక్కి పోలీస్ కేసుల దాకా వెళ్లింది. ఇక మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్ పై దాడి చేయడంతో ఈ గొడవలు కాస్తా తారాస్థాయికి చేరుకున్నాయి.

Manchu Manoj: 'నీవల్లే అంతా కలిసున్నాం.. నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా'.. తల్లికి మంచు మనోజ్ బర్త్ డే విషెస్
Manchu Manoj
Basha Shek
|

Updated on: Dec 15, 2024 | 5:51 PM

Share

గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవలే వార్తలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ మంచు ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య కాస్తా రచ్చ కెక్కి ఏకంగా పోలీసు కేసుల దాకా వెళ్లాయి. ఇక మోహన్ బాబు టీవీ 9 ప్రతినిధిపై దాడి చేయడం, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇందులో తప్పెవరిదైనా మోహన్ బాబు భార్య, మనోజ్ తల్లి నిర్మలమ్మ మాత్రం తెగ కుమిలిపోతుంది. అయితే ఇప్పటివరకు ఆమె ఈ గొడవలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన తల్లికి బర్త్ డే విషెస్ చెప్పాడు మనోజ్. తల్లితో కలిసున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అతను.. .. హ్యాపీ బర్త్‌డే అమ్మ. మన కుటుంబానికి నువ్వు హృదయంలాంటిదానివి. నీ ఆత్మధైర్యం నన్ను ప్రతిరోజు ఇన్‌స్పైర్‌ చేస్తుంది. నీ ప్రేమాభిమానాల వల్లే అందరం కలిసి ఉండగలుగుతున్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడూ మాకు అండగా నిలబడ్డావు. అదే విధంగా నేనూ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లీ’అని అమ్మపై ప్రేమకు అక్షర రూపమిచ్చాడు మనోజ్.

మంచు మనోజ్ షేర్ చేసిన ఫొటోస్, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోవాలని, అందరూ కలిసి మెలసి ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..

మనోజ్ కూతురి నామకరణం వేడుకలో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.