AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మంచు లక్ష్మి.. ఏకంగా 500 ప్రభుత్వ స్కూళ్లలో..

టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరంలేని పేరు మంచు లక్ష్మి. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా, యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామె. అయితే చాలా కాలంగా మంచు లక్ష్మి సినిమాల్లో కనిపించడం లేదు.

Manchu Lakshmi: మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మంచు లక్ష్మి.. ఏకంగా 500 ప్రభుత్వ స్కూళ్లలో..
Manchu Lakshmi
Basha Shek
|

Updated on: Jun 26, 2024 | 7:26 PM

Share

టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరంలేని పేరు మంచు లక్ష్మి. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా, యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామె. అయితే చాలా కాలంగా మంచు లక్ష్మి సినిమాల్లో కనిపించడం లేదు. ఇటీవల వచ్చిన యక్షిణి హారర్ వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్ర మాత్రమే చేసింది. పైగా తన నివాసాన్ని ముంబైకు షిఫ్ట్ చేసింది. సినిమాల్లో కనిపించకపోయినా తన సేవా కార్యక్రమాలతో నిత్యం వార్తల్ల నిలుస్తోంది మంచు లక్ష్మి. ముఖ్యంగా పేద విద్యార్థుల చదువు కోసం ఆమె చేస్తున్న కృషికి హ్యాట్సఫ్ చెప్పాల్సిందే. టీచ్ ఫర్ ఛేంజ్ సేవా సంస్థ తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుందామె. అక్కడి విద్యార్థులకు కావాల్సిన చదువు, వసతి తదితర సౌకర్యాలను కల్పిస్తూ తన గొప్ప మనసును చాటుకుంటోంది. ఇప్పుడు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మంచు లక్ష్మి. అదేంటంటే.. సర్కారు స్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు. టీచ్ ఫర్ ఛేంజ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని 500 ప్రభుత్వ స్కూళ్లల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసింది మంచు వారమ్మాయి.

తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని 20 ప్రభుత్వ స్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూమ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది మంచు లక్ష్మి. కోతిరాంపూర్‌ (పోచంపల్లి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన క్లాస్‌ రూంను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మిని ప్రత్యేకంగా అభినందించారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో మంచు వారమ్మాయి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లలా మారుస్తామన్నారు. విదేశాల్లో స్థిర పడిన ఎన్నారైలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని ఆమె పిలుపు నిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us