Bollywood Actress: పేరుకు ముంబై ముద్దుగుమ్మలే కానీ.. చూపంతా టాలీవుడ్‌పైనే.!
పేరుకు వాళ్లు ముంబై ముద్దుగుమ్మలే కానీ చూపంతా మాత్రం టాలీవుడ్‌పైనే ఉంది. ఒక్కరో ఇద్దరో కాదు.. బాలీవుడ్ బ్యూటీస్ అంతా ఇప్పుడు తెలుగు సినిమా వైపు పరుగులు తీస్తున్నారు. మన హీరోలు కూడా ఎక్కువగా నార్త్ హీరోయిన్స్ కావాలంటున్నారు. ఇటు ఎన్టీఆర్.. అటు రామ్ చరణ్.. హీరో ఎవరైనా జోడీ మాత్రం బాంబే భామే అంటున్నారు. తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లు నటించడం కొత్తేం కాదు.. కానీ ఈ మధ్య ప్రతీ సినిమాలోనూ బాలీవుడ్ బ్యూటీనే కనిపిస్తున్నారు.