- Telugu News Photo Gallery Cinema photos Director boyapati srinu clarity on script changes in kannada 2 movies with balakrishna Telugu Heroes Photos
Akhanda 2: బాలయ్య కోసం తప్పడం లేదు అంటున్న బోయపాటి.. అదే కారణమా.?
అఖండ 2 అనుకున్న టైమ్‌కు మొదలవుతుందా..? లేదంటే ముందు ప్లాన్ చేసిన దానికంటే ఆలస్యం కానుందా..? ఉన్నట్లుండి ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకొస్తున్నాయి అనుకుంటున్నారు కదా..? అనుకోని మార్పులు చాలా జరిగినపుడు.. కథలోనూ మార్పులు చేయాలి కదా అంటున్నారు బోయపాటి. ఇంతకీ ఈయన ప్లాన్ ఏంటి..? రాజకీయాల నుంచి కాస్త ఫ్రీ అయ్యారు బాలకృష్ణ. ప్రస్తుతం ఈయన కమిటైన బాలయ్య బాబీ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు బాలయ్య.
Updated on: Jun 26, 2024 | 6:44 PM

అఖండ 2 అనుకున్న టైమ్‌కు మొదలవుతుందా..? లేదంటే ముందు ప్లాన్ చేసిన దానికంటే ఆలస్యం కానుందా..? ఉన్నట్లుండి ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకొస్తున్నాయి అనుకుంటున్నారు కదా..?

మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య.. ఈ మధ్యే బాబీ సినిమా లొకేషన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. NBK 109 షూట్ ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో జరుగుతుంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది.

ప్రస్తుతం ఈయన కమిటైన బాలయ్య బాబీ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు బాబీ.

ఇది సెట్స్‌పై ఉండగానే బోయపాటి సినిమాకు ఓకే చెప్పారు NBK. బాబీ సినిమా మరో రెండు నెలల్లో పూర్తయ్యేలా కనిపిస్తుంది. మొన్నటి వరకు పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు కాబట్టి లేట్ అయింది కానీ లేదంటే ఈ పాటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యేది.

నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నియర్ ఫ్యూచర్‌లో రిలీజ్ చేయబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్‌కి తెర లేపినట్టయింది. ఒకరూ, ఇద్దరూ కాదు.. అంతకు మించే.. కెప్టెన్లు వీళ్లిద్దరు ఇచ్చే హిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇయర్ స్టార్టింగ్‌లో వీరసింహారెడ్డితో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించారు. ఇయర్ ఎండింగ్‌లో శ్రీలీలకు గార్డియన్‌గా ఉయ్యాలో ఉయ్యాలా అంటూ ఇచ్చిపడేద్దాం అంటూ భగవంత్ కేసరితో ఆకట్టుకున్నారు.

అందుకే అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా సెట్స్‌పైకి వచ్చేలా ఉంది బాలయ్య, బోయపాటి సినిమా. ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో 14 రీల్స్, బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.





























