AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు

లైఫ్ అఫ్ పై అనేది ఒక వ్యక్తి  టీనేజ్ లో జరిగిన విచిత్ర సంఘటనల, అనుభవాల ద్వారా పై ఒక రచయితకు చెప్పే తన కథ ఇది. పై పటేల్ పాండిచ్చేరీలో ఒక జూ యజమాని కొడుకు. అమ్మ, నాన్న, అన్న  కలిసి జీవిస్తూ ఉంటాడు. అయితే అనుకోని కారణాల వల్ల పై పటేల్ ఫ్యామిలీ జూ లోని జంతువులతో సహా కెనడా వెళ్తారు.

లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు
Life Of Pi
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2024 | 7:27 PM

Share

లైఫ్ అఫ్ పై.. హాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. లైఫ్ అఫ్ పై అనేది 2001 లో రచింపబడిన ప్రసిద్ధ నవల. యాన్‌ మార్‌ట్టెల్ అనే రచయిత ఈ నవలను రాచించాడు. ఈ నవల ఆదరంగా హాలీవుడ్ లో సినిమాను తెరకెక్కించారు. ఈ నవలను అంగ్ లీ దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసారు. లైఫ్ అఫ్ పై అనేది ఒక వ్యక్తి  టీనేజ్ లో జరిగిన విచిత్ర సంఘటనల, అనుభవాల ద్వారా పై ఒక రచయితకు చెప్పే తన కథ ఇది. పై పటేల్ పాండిచ్చేరీలో ఒక జూ యజమాని కొడుకు. అమ్మ, నాన్న, అన్న  కలిసి జీవిస్తూ ఉంటాడు. అయితే అనుకోని కారణాల వల్ల పై పటేల్ ఫ్యామిలీ జూ లోని జంతువులతో సహా కెనడా వెళ్తారు.

జూలోని కొన్ని ముఖ్యమైన జంతువులని అమెరికాలోని కొన్ని జూలకి అమ్మేసారు. ఆ జంతువులని ఓడలో కెనడా తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. తన కుటుంబం తోనూ, ఆ జంతువులతోనూ కలిసి, ఒక జపానీ ఓడలో పసఫిక్ మహా సముద్రం మీద ప్రయాణం చేస్తుంటాడు. ఇంతలో ఓ తుఫాను రావడంతో ఆ ఓడ మునిగిపోతుంది.

అయితే ఒక చిన్న లైఫ్ బోట్లోకి పై పటేల్ చేరుతాడు. తనతో పాటు ఓ పులి కూడా అదే బోట్లోకి చేరుతుంది. కానీ తన ఫ్యామిలీ మొత్తం ఆ ఓడలో మునిగిపోతుంది. ఆతర్వాత ఆ సముద్రం నుంచి అతను ఎలా బయట పడ్డాడు. పులితో అతను ఎలా గడిపాడు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు అనేది సినిమాలో చూపిస్తారు. ఈ సినిమ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. కేవలం ఓ స్విమింగ్ పూల్ లో ఈ సినిమాను చిత్రీకరించారు. అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ లో పై పటేల్ ఓ అమ్మాయికి ఫిదా అవుతాడు. క్లాసిక్ డాన్స్ చేసే ఓ అమ్మాయిని ఇష్టపడతాడు పై పటేల్. ఆ అమ్మయి గుర్తుందా.? ఆ అమ్మయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఆమె పేరు శ్రవంతి సాయినాథ్.  లైఫ్ అఫ్ పై సినిమాలో టీనేజ్ యువతిగా కనిపించిన ఆమె ఇప్పుడు చాలా మారిపోయింది. లైఫ్ అఫ్ పై సినిమా తర్వాత ఈ చిన్నది పెద్దగా సినిమాల్లో నటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా శ్రవంతి సాయినాథ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

శ్రవంతి సాయినాథ్ ఇన్ స్టా..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us