Baby Movie: ‘బేబీ’ సినిమా మళ్లీ రిలీజ్.. మరిన్ని సీన్స్, సాంగ్ యాడ్ చేసిన టీం.. ఇక మరింత ఎంటర్టైన్మెంట్..
బేబీ చిత్రంలో వైష్ణవి, ఆనంద్, విరాజ్ అశ్విన్ నటనకు ప్రేక్షకులతోపాటు.. సెలబ్రెటీలు ముగ్దులయ్యారు. ఇప్పటికే ఈ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్ గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యి 25 రోజులు పూర్తి చేసుకోవడంతో సినిమా అభిమానులకు.. ప్రేక్షకులకు మరో క్రేజీ న్యూస్ అందించింది చిత్రయూనిట్. సినిమాలో ఎడిటింగ్ లో తీసేసిన మరిన్ని సన్నివేశాలు... ఒక సాంగ్ యాడ్ చేసి మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబి. ఇందులో విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. జూలై 14న రిలీజ్ అయిన ఈ ప్రేమకథా చిత్రమ్ యూత్‌ను ఆకట్టుకుంటుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఇప్పటికే దాదాపు రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. అలాగే ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. బేబీ చిత్రంలో వైష్ణవి, ఆనంద్, విరాజ్ అశ్విన్ నటనకు ప్రేక్షకులతోపాటు.. సెలబ్రెటీలు ముగ్దులయ్యారు. ఇప్పటికే ఈ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్ గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యి 25 రోజులు పూర్తి చేసుకోవడంతో సినిమా అభిమానులకు.. ప్రేక్షకులకు మరో క్రేజీ న్యూస్ అందించింది చిత్రయూనిట్.
సినిమాలో ఎడిటింగ్ లో తీసేసిన మరిన్ని సన్నివేశాలు… ఒక సాంగ్ యాడ్ చేసి మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. అలాగే నేడు హైదరాబాద్ సంధ్య థియేటర్లో యాడ్ చేసిన సన్నివేశాలతో సాయంత్రం ఫస్ట్ షో వేసి అనంతరం అన్ని చోట్ల రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. మూవీ టీం నిర్ణయంపై మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




మరోవైపు ఈ సినిమా రిలీజ్ అయి 25 రోజులు అవుతున్నా.. ఇంకా భారీగా కలెక్షన్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. చిత్రయూనిట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తుంది. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను ఎస్కేఎన్ నిర్మించారు. ఇక ఇందులో కథానాయికగా నటించిన వైష్ణవి నటన ప్రేక్షకులను హృదయాలను తాకింది. ఈ మూవీతో తెలుగమ్మాయి హీరోయిన్ గా సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి. అందమైన సన్నివేశాలు, అద్భుతమైన నటన, హృదయాన్ని హత్తుకునే బలమైన సంభాషణలు.. మ్యూజిక్.. అన్ని ఈ మూవీకి హైలెట్ అయ్యాయి.
Let the celebrations begin 🎉
It’s time to celebrate the 𝟐𝟓 𝐃𝐀𝐘𝐒 of #CultBlockbusterBaby 🤩
This Sunday join team #BabyTheMovie at Sandhya 70MM for First Show With new song & added scenes, experience it at theatres near you!❤️
Book Tickets Here – https://t.co/kcxxTqCO6y pic.twitter.com/smi96WBzlz
— #CultBlockbusterBaby (@MassMovieMakers) August 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.