Mahesh Babu: ‘ఏమున్నాడ్రా మా అన్న’.. మెంటలెక్కిస్తోన్న మహేశ్ న్యూ లుక్
మహేశ్ బాబు కొత్త సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. బాబు తాజా లుక్ ఫ్యాన్స్.. పిచ్చిక్కిపోతున్నారు. బాబు.. రాజమౌళి మా అన్నతో ఏం ప్లాన్ చేస్తున్నావ్.. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తాజా లుక్‌లో పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపించాడు మహేశ్.
మిల్కీ బాయ్ మహేష్.. రఫ్‌లుక్‌లో కనిపిస్తున్నారు.. పొడవుగా జుట్టు పెంచి.. గుబురు గడ్డంతో.. మాస్ గెటప్‌కి వచ్చేశారు.. ఇదంతా రాజమౌళితో సినిమా కోసమే అనేది అందరికీ తెలిసిందే..! SSMB-29 పాన్ఇండియా స్టేజ్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్లో తీయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ మేకోవర్ ఎలా ఉండబోతోందోననే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది.
ఇవాళ తెలంగాణ CM రేవంత్‌ని కలిసారు మహేష్‌బాబు. ఇటీవల వరద బాధితుల సాయం కోసం తన వంతుగా ఇస్తానన్న మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. శ్రీమతి నమ్రతతో కలిసి CMను కలిసి చెక్ అందిచారు. సీఎం సహాయ నిధికి 60 లక్షల విరాళం అందించారు. జూబ్లీహిల్స్‌లోని CM నివాసానికి వెళ్లి ఈ చెక్ ఇచ్చారు. ఫ్యామిలీ నుంచి 50 లక్షలు, AMB తరపున మరో 10 లక్షలు అందించారు.
CMను కలిసిన సందర్భంగా మహేష్ లుక్ స్పెషల్‌గా కనిపించింది. లాంగ్ హెయిర్, బియర్డ్‌తో మాస్‌లుక్‌లో కనిపించారు మహేష్.ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ రిలీజ్ అయ్యింది. మహేష్ కొత్త ప్రాజెక్ట్‌పై అప్పట్నుంచి ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. రాజమౌళి డైరెక్షన్లో మూవీ విషయం కన్ఫామ్ అయినా.. గెటప్ కోసం మేకోవర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే విదేశాల్లో కొన్ని ట్రైనింగ్స్ కూడా తీసుకున్నారు. దుబాయ్‌లో స్టోరీ సిట్టింగ్‌లు కూడా జరిగాయి. అమేజాన్ అడవుల నేపథ్యంలో ఈ కథ సాగుతందని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ లుక్ ఎలా ఉండాలనే దానిపై కొన్ని స్క్రీన్ టెస్ట్‌లు కూడా చేశారు.
SSMB 29 సినిమా ఇప్పుడోఅప్పుడో అంటూ ఊరిస్తూనే ఉన్నారు. కృష్ణ జయంతిరోజు మహేష్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూశారు. మహేష్ పుట్టిన రోజునైనా అప్డేట్ వస్తుందని ఎదురు చూసినా అప్పుడూ నిరాశే ఎదురైంది. ఇంటర్నేషనల్ లెవెల్లో మహేష్ మూవీ ఉండాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ విషయంలో అన్లిమిటెడ్ మోడ్‌లోనే రెడీ అవుతున్నారు. ఈ మధ్య మత్తు వదలరా -2 ప్రమోషన్లో కూడా SSMB-29 ప్రస్తావన వచ్చింది.. ఐతే.. అప్డేట్స్ చెప్పేందుకు రాజమౌళి సింపుల్‌గా నో చెప్పారు..! ఈ డిసెంబర్‌కి గానీ ప్రాజెక్ట్‌పై పూర్తి అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఒకసారి రాజమౌళి సినిమా మొదలైతే 3 ఏళ్లు మహేష్ అందులో లాక్ అయినట్టే..! ఈ మూవీకి ఫారిన్ టెక్నీషియన్లను, నటీనటుల్ని కూడా అప్రోచ్ అవుతున్నారు రాజమౌళి..!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.