- Telugu News Photo Gallery Cinema photos Heroine kareena kapoor hopes on Yash Toxic movie in South movie Telugu Actress Photos
Kareena Kapoor: సౌత్ లో అదృష్టం పరీక్షించుకుంటున్న నార్త్ హీరోయిన్స్.. ఇప్పుడు కరీనా వంతు.!
దీపిక వచ్చేశారు.. దిశా పాట్ని ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ అనన్య పలకరించారు. జాన్వీ ముస్తాబవుతున్నారు... మరి మీ రాక ఎప్పుడు? అని కరీనాని అడిగితే చిరునవ్వును సమాధానంగా విసురుతున్నారు. ఇంతకీ బెబో సౌత్ ఎంట్రీకి సర్వం సిద్ధమైనట్టేనా? నార్త్ లోనే కాదు, నేను సౌత్‌లో సినిమా చేసినా, వెయ్యి కోట్లు పక్కా అనే మాటను స్ట్రాంగ్‌గా చెప్పేశారు దీపిక పదుకోన్. కల్కి సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగువారి హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు.
Updated on: Sep 23, 2024 | 12:45 PM

కరీనా మాత్రం ఇంకా ఈ వైపు చూడటం లేదు. యష్ టాక్సిక్‌తోనే ఎంట్రీ ఇచ్చేస్తారని అందరూ ఎదురుచూసినా, ఆఖరి నిమిషంలో తూచ్ అనేశారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు తనను ఎవరూ అప్రోచ్ కాలేదన్నారు.

ఇంతకీ బెబో సౌత్ ఎంట్రీకి సర్వం సిద్ధమైనట్టేనా? నార్త్ లోనే కాదు, నేను సౌత్‌లో సినిమా చేసినా, వెయ్యి కోట్లు పక్కా అనే మాటను స్ట్రాంగ్‌గా చెప్పేశారు దీపిక పదుకోన్.

కల్కి సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగువారి హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇదే కల్కి మూవీతో హిట్‌ని మార్క్ చేసుకున్నారు దిశా పాట్ని.

దీపిక, దిశా ప్రూవ్ చేసుకున్న ఇదే ఏడాది తన లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు జాన్వీ కపూర్. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయారు. కచ్చితంగా హిట్ అందుకుంటాననే ధీమా కనిపిస్తోంది శ్రీదేవి తనయలో.

సో.. ఇప్పుడు ప్రభాస్, మొన్నటికి మొన్న యష్ మూవీస్‌తో వార్తల్లో అయితే ఉన్నారు కానీ, సైన్ చేయలేదన్నమాట కరీనా కపూర్.

నార్త్ బ్యూటీలంతా సౌత్ ఎంట్రీ కోసం ట్రై చేస్తుంటే ఇన్నాళ్లూ కామ్‌గా కనిపించారు బెబో కరీనా. మొన్నటికి మొన్న యష్ టాక్సిక్‌తో ఎంట్రీ ఇచ్చేస్తున్నారనే అందరూ అనుకున్నా.. అది జరగలేదు.

అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ని ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో భర్తీ చేయడానికి రెడీ అయిపోయారట బెబో.. 2025లో ఆమెకు సంబంధించి ప్రాజెక్ట్ వివరాలు బయటికి వస్తాయన్నది నార్త్ లో వైరల్ అవుతున్న వార్త.




