NTR – Devara: దేవర పై వరాల జల్లు.! అప్పుడు కల్కి.. ఇప్పుడు దేవర..
పెద్ద సినిమాలు విడుదల అయితే ఒకప్పుడు ఎలా ఉంది..? హీరో ఎలా చేసాడు.. దర్శకుడు బాగా తీసాడా అని అడిగేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. ఓ స్టార్ హీరో సినిమా వస్తుంటే టికెట్ రేట్లు ఎంత పెంచారు.? ఒక్కో టికెట్‌పై ఏ రేంజ్ హైక్ ఇచ్చారు అని అడుగుతున్నారు. తాజాగా దేవరకు ఇదే జరిగింది. మరి ఈ సినిమాకు టికెట్ రేట్లు ఎంత పెరగబోతున్నాయి..? పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపికబురు చెప్తున్నాయి.