Mahesh Babu: మహేష్ బాబు కీలక నిర్ణయం.. హైదరాబాద్‏లో కృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు.. ఎక్కడంటే ?..

కృష్ణ మరణాన్ని ఇప్పటికి సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దివికేగిన నటశేఖరుడు గుర్తులను పదిలంగా భద్రపరుచుకునేందుకు ఆయన కుటుంబం కీలకనిర్ణయం తీసుకుంది.

Mahesh Babu: మహేష్ బాబు కీలక నిర్ణయం.. హైదరాబాద్‏లో కృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు.. ఎక్కడంటే ?..
Krishna, Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2022 | 6:53 AM

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో యావత్ తెలుగు సినీ ప్రపంచం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. తెలుగు సినీ జగత్తుకి దిశానిర్దేశం చేసిన సాహస నటుడికి యావత్‌ తెలుగు సమాజం గుండెలోతుల్లోంచి నివాళులర్పిస్తోంది. బుధవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. తమ హీరోను కడసారి చూసేందుకు వందలమంది అభిమానులు, చలనచిత్ర, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మరోవైపు కృష్ణ మరణాన్ని ఇప్పటికి సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దివికేగిన నటశేఖరుడు గుర్తులను పదిలంగా భద్రపరుచుకునేందుకు ఆయన కుటుంబం కీలకనిర్ణయం తీసుకుంది. ఇందుకోసం భాగ్యనగరంలో కృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని మహేష్ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలాగే ఆయనకు సంబంధించిన గుర్తులన్నింటినీ పొందుపరుస్తారట. హైదరాబాదులో పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయనకి సంబంధించిన 350 సినిమాలో పేర్లు, ఫోటోలు, అవార్డులను ఆయన కాంస్య విగ్రహంలో ఉంచుతారని సమాచారం.

కృష్ణ మెమోరియల్‏ను సందర్శించే ప్రజలు కాసే పు అక్కడే గడిపి. సూపర్ స్టార్ కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారట. అయితే ఆయన మెమోరియల్‏ను పద్మాలయ స్టూడియో వద్ద ఏర్పాటు చేయాలని మహేష్ భావిస్తున్నారట. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోకు ఇలాంటి మెమోరియల్ లేదు. కేవలం ఎన్టీఆర్‏కు మాత్రమే ఉంది.

ఇవి కూడా చదవండి

కృష్ణ జీవితం అతి పెద్ద సినీ మ్యూజియం. ఇందులో ఎన్నో మధురానుభూతులు, ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. కృష్ణ షూటింగ్ సమయంలో చాలా చాలా కామ్. ఆయన మైండ్ ఎప్పుడూ ఎంప్టీగా ఉండేది కాదు. ఎప్పుడూ.. షూటింగులు, ప్రొడ్యూసర్లు, వారి సాధక బాధకాలు, హెట్ టిక్ షెడ్యూల్ తప్ప.. ఆయన ఇతర విషయాల మీద పెద్దగా కాన్ సన్ ట్రేట్ చేసేవారు కాదు. అయితే ఇదంతా ఒక సిస్టమాటిగ్గా జరిగిపోతూ ఉంటుంది. వన్ బై వన్ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లేవారు కృష్ణ. ఒకటా రెండా సుమారు యాభై ఏళ్ల సుదీర్గ సినీ జీవితంలో ఆయనకు రకరకాల యావగేషన్లు. దీంతో ఆయన స్పాట్ లో ఎంతో సైలెంట్ గా ఉండేవారు. అదే సమయంలో ఆయన కాంపౌండ్ ఒక మూవీ ఫ్యాక్టరీలా ఉండేది. ఆయన సినీ సాంకేతికత మీద విపరీతంగా దృష్టి సారించేవారు. ఆయా టెక్నికాల్టీస్ గురించి విని వదిలేయకుండా.. తన సినిమాల్లోకి తప్పక తీసుకొచ్చేవారు. అలా తన సినిమాల ద్వారా కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేస్తూ.. తెలుగు తెరపై ఎన్నో చిత్ర విచిత్రాలు నమోదు చేశారాయన.

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!