Namrata -Mahesh Babu: ‘ఆరోజు మా జీవితాల్లో భయానకమైనది.. ఎప్పటికీ మర్చిపోలేము’.. ఆ క్షణాన్ని మళ్లీ గుర్తు చేసుకున్న నమ్రత..

పెళ్లి తర్వాత మహేష్ తో తన జీవితం ఇంత ఆనందంగా ఉండటానికి కారణం.. ఒకరిపై మరొకరికి ఉండే నమ్మకమని అన్నారు నమ్రత

Namrata -Mahesh Babu: 'ఆరోజు మా జీవితాల్లో భయానకమైనది.. ఎప్పటికీ మర్చిపోలేము'.. ఆ క్షణాన్ని మళ్లీ గుర్తు చేసుకున్న నమ్రత..
Namrata
Follow us

|

Updated on: Dec 18, 2022 | 1:30 PM

గౌతమ్ సితార పుట్టిన తర్వాత తమ జీవితాలు పూర్తిగా మారిపోయాయని.. ఒక తల్లిగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత.. ఫ్యామిలీ విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత మహేష్ తో తన జీవితం ఇంత ఆనందంగా ఉండటానికి కారణం.. ఒకరిపై మరొకరికి ఉండే నమ్మకమని అన్నారు. నమ్రత మాట్లాడుతూ.. ” ఇద్దరి వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటే ఏ బంధమైన సంతోషంగా సాగుతుంది. మహేష్‏తో నా వివాహం జరిగిం 17 ఏళ్లు అవుతుంది. పెళ్లి కాకముందు మేమిద్దరం మంచి స్నేహితులం. అన్ని విషయాలను పంచుకునేవాళ్లం. మా మధ్య రహస్యాలు , అనుమానాలు, అపనమ్మకాలకు చోటు లేదు. ఒకవేళ ఆయన ఎప్పుడైనా బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్లావు ? ఎవరితో ఉన్నావు ? ఏం చేస్తున్నావు ? అని పదిసార్లు ఫోన్లు చేసి విసిగించను. అనుమానించను.. ఆయన కూడా అంతే. ఇక గౌతమ్.. సితార పుట్టిన తర్వాత మా జీవితం పూర్తిగా మారిపోయింది.

ఒక తల్లిగా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. గౌతమ్ పుట్టిన రోజుని మేము ఎప్పటికీ మర్చిపోలేం. అది మా జీవితాల్లో ఓ భయానకమైన సమయం. ఏడో నెలలో చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లాను. బాబు పేగు మెడలో వేసుకున్నాడని.. ఊపిరి తీసుకోలేకపోతున్నాడని, హార్ట్ బీట్ సరిగా లేదని వైద్యులు చెప్పారు. మహేష్ కు ఫోన్ చేశారు. మహేష్ ఆ సమయంలో హైదరాబాద్ ఫిలింసిటీలో ఓ షూట్ లో ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి వచ్చారు. సర్జరీ చేసి బాబును బయటకు తీశారు. అప్పుడు తను 1.5 కేజీలు మాత్రమే ఉన్నాడు.

బాబు విషయంలో మేము ఏం చెప్పలేమని వైద్యులు మహేష్ కు ముందే చెప్పేశారు. మూడు వారాలపాటు బాబుని వైద్యుల సంరక్షణలోనే ఉంచాం. రోజుకు కేవలం 40 గ్రాములు మాత్రమే పాలు పట్టించాలని..ప్రతి రోజూ 10 గ్రాముల బరువు పెరగాలని సూచించారు. ప్రతి రోజు నిద్రపోయే ముందు గౌతమ్ బరువు పెరగాలని దేవుడ్ని కోరుకునేవాళ్లం. గౌతమ్ ఇప్పుడు ఇలా ఉన్నాడంటే అందుకు వైద్యులే కారణం ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..