Tollywood: చూడగానే ముద్దొచ్చేస్తోన్న ఈ బార్బీ డాల్ ఎవరో కనిపెట్టండి.. ఒకప్పుడు కుర్రకారును పిచ్చెక్కించిన క్రేజీ గర్ల్..
పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ బార్బీ డాల్ ఎవరో గుర్తుపట్టండి. తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. ఫస్ట్ మూవీతోనే ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలువురు సీనితారల రేర్ ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. చిన్ననాటి ఫోటోస్, అరుదైన పిక్చర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ బ్యూటి పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె ఎవరో తెలుసుకుందామా. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ బార్బీ డాల్ ఎవరో గుర్తుపట్టండి. తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. ఫస్ట్ మూవీతోనే ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందం.. అభినయం ఉన్నా.. ఈ ముద్దుగుమ్మకు రాను రాను అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఎవరో గుర్తుపట్టండి. ఈ భామ మరెవరో కాదండి.. టాలీవుడ్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్.
మడత కాజా సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్. ఆ తర్వాత అలా మొదలైంది. వరుడు, సింహా, కరెంట్, ఉల్లాసంగా ఉత్సాహంగా, నేను మీకు తెలుసా, కింగ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్ చిత్రాలతో స్నేహకు గుర్తింపు వచ్చింది. ఈ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.
అయితే స్నేహ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మంగుళూరుకు చెందిన స్నేహ.. 1985లో మస్కట్ లో జన్మించింది. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. హిందీలో లక్కీ నో టైమ్ ఫర్ లవ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఆమెను జూనియర్ ఐశ్వర్య రాయ్ అని పిలుస్తుంటారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.