Mahesh Babu: ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు మహేష్ బాబు.. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో చూశారా? వీడియో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేరవుతున్నాడు. ఈ సినిమా కథేంటో తెలియదు కానీ దీని కోసం మహేష్ తన లుక్ మొత్తాన్ని మార్చేసుకున్నాడు. గతంలో ఎన్నడూ లేనతంగ జుట్టు, గడ్డం, బాడీ పెంచేశాడు

Mahesh Babu: ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు మహేష్ బాబు.. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో చూశారా? వీడియో
Mahesh Babu
Follow us
Basha Shek

|

Updated on: Oct 07, 2024 | 12:34 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేరవుతున్నాడు. ఈ సినిమా కథేంటో తెలియదు కానీ దీని కోసం మహేష్ తన లుక్ మొత్తాన్ని మార్చేసుకున్నాడు. గతంలో ఎన్నడూ లేనతంగ జుట్టు, గడ్డం, బాడీ పెంచేశాడు. దీంతో మహేష్ ఈ మధ్య ఎప్పుడు బయట కనిపించినా అతని లుక్స్ తెగ వైరలవుతున్నాయి. తాజాగా మరోసారి అదిరిపోయే స్టైలిష్ లుక్ తో దర్శనమిచ్చాడు మహేష్ బాబు. తరచుగా విదేశాలకు వెళ్లే సూపర్ స్టార్ తాజాా మరోసారి ఫారిన్ టూర్ కు చెక్కేశాడు. అయితే ఇది పర్సనలా? లేదా ప్రొఫెషనల్ ట్రిప్ నా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అమెరికాలో ఉన్న కొడుకు గౌతమ్ దగ్గరికా లేదా రాజమౌళి సినిమా వర్క్ కోసం వెళుతున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది. సోమవారం (అక్టోబర్ 07) ఉదయం మహేశ్, నమ్రత హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. ఈ సందర్భంగా మహేష్ స్టైలిష్ హుడీ వేసుకొని, గాగుల్స్, క్యాప్ పెట్టుకొని గడ్డం, లాంగ్ హెయిర్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో విజువల్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు చివరగా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఇది మహేష్ రేంజ్ సినిమా కాదని కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. ఇందులో భాగంగానే దర్శక ధీరుడు రాజమౌళితో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ కోసం అభిమానులంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు జక్కన్న సినిమా కోసం మహేష్ కూడా బాగా కష్టపడుతున్నాడు. భారీ వర్కౌట్స్ చేస్తూ బాడీ మెయింటేన్ చేస్తున్నాడు. అలాగే భారీ గడ్డంతోనూ కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

ఎయిర్ పోర్ట్ లో మహేశ్ బాబు..

ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.