Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAD Square Movie Review: మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ.. డబుల్ డోస్ ఎంటర్‌టైన్మెంట్ గ్యారెంటీ..

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సినిమా మ్యాడ్. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. మరి ఇది కూడా అదే స్థాయిలో నవ్వించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఈసారి మ్యాడ్ స్క్వైర్ డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపిస్తోంది.

MAD Square Movie Review: మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ.. డబుల్ డోస్ ఎంటర్‌టైన్మెంట్ గ్యారెంటీ..
MAD Square Movie Review
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Mar 28, 2025 | 4:00 PM

మూవీ రివ్యూ: మ్యాడ్ స్క్వేర్

నటీనటులు : నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్, విష్ణు తదితరులు

సంగీతం: భీమ్స్

సినిమాటోగ్రఫీ: షామ్ దత్,

ఎడిటర్: నవీన్ నూలి

దర్శకుడు: కళ్యాణ్ శంకర్

నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య.

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సినిమా మ్యాడ్. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. మరి ఇది కూడా అదే స్థాయిలో నవ్వించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

అశోక్ (నార్నే నితిన్), సంగీత్ శోభన్ (డిడి), మనోజ్ (రామ్ నితిన్) కాలేజ్ తర్వాత ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోతారు. అయితే మూడేళ్ళ తర్వాత లడ్డు ( విష్ణు)పెళ్లి కోసం మళ్లీ కలుస్తారు. వచ్చిన తర్వాత ఆ పెళ్లిలో గోల మొదలవుతుంది. లడ్డూ పెళ్లి ఘనంగా జరపాలని కోరుకుంటారు కానీ చివరి నిమిషంలో పెళ్లి కూతురు లేచిపోవడంతో ఆ పెళ్లి కాస్తా ఆగిపోతుంది. దాంతో అంతా కలిసి గోవా వెళ్తారు. గోవాలో ఓ స్మగ్లింగ్ బ్యాచ్ వల్ల ఈ నలుగురు ఇబ్బందుల్లో పడతారు. అలా అనుకోకుండా భాయ్ అలియాస్ మ్యాక్స్ (సునీల్) వీళ్ళ జీవితంలోకి వస్తాడు. అసలు మ్యాడ్ బ్యాచ్‌తో మ్యాక్స్‌కు ఏంటి సంబంధం..? వాళ్లేం తప్పు చేసారు అనేది మిగిలిన కథ..

కథనం:

కేవలం బ్రాండ్‌తోనే సినిమాలు ఆడేస్తాయా.. అంటే ఆడతాయి. ఈ మధ్య మ్యాడ్ స్క్వేర్‌తో పాటు ఈ మధ్య కొన్ని సీక్వెల్స్ చూసాక ఇదే అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ హిట్టైతే చాలు.. వాటికి పార్ట్ 2 తీస్తున్నారు. కథ కాస్త అటూ ఇటూగా ఉన్నా కూడా బ్రాండ్‌తో బయటపడిపోతున్నాయి సినిమాలు. మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. కథ లేదు కానీ కామెడీ మాత్రం ఫుల్లుగా ఉంది. మ్యాడ్ అంటేనే కథ లేకపోయినా పర్లేదు గానీ కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తే చాలు అంటారు ఆడియన్స్. ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఇలాంటి సినిమాలో లాజిక్స్ వెతక్కూడదు.. జస్ట్ ఎంజాయ్ చేయాలంతే. మ్యాడ్ చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటాం.. ఎక్కడా బోర్ కొట్టదు. మ్యాడ్ స్క్వేర్ కూడా అంతే. చాలా వరకు కామెడీ సీన్స్ అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. ఇందులో కూడా కొన్ని సీక్వెన్సులు బాగా పేలాయి.. బాగా నవ్వించారు కూడా. ముఖ్యంగా సునీల్ వచ్చిన ప్రతీసారి నవ్వు ఆగదు. అలాగే ఫస్టాఫ్‌లో లడ్డూ పెళ్లి సీక్వెన్స్.. సెకండాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్ అదిరిపోయాయి. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌తో నవ్వించారు మ్యాడ్ కుర్రాళ్లు. వీకెండ్‌కు సరదాగా నవ్వుకుందాం అనుకుంటే మ్యాడ్ స్క్వేర్ చక్కటి ఛాయిస్. ఇందులో కథ అంటూ ఏం లేకపోయినా కూడా ఎపిసోడ్స్ వైజ్‌గా మాత్రం బాగా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్.

నటీనటులు:

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ మరోసారి నవ్వించారు. ముగ్గురూ ముగ్గురే. ఎవరూ తక్కువ కాదు.. ఎక్కువ కాదు. చివర్లో నార్నె నితిన్ కాస్త లీడ్ తీసుకున్నాడు. ఇక లడ్డూగా విష్ణు కూడా అదరగొట్టాడు.. సునీల్ చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వించాడు. ఈయనకు సరైన పాత్ర పడితే ఎలా ఉంటుందో మ్యాడ్ స్క్వేర్‌లో చూపించాడు. లడ్డూ తండ్రిగా మురళీధర్ గౌడ్ అదరగొట్టాడు. మిగిలిన వాళ్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

భీమ్స్ మ్యూజిక్ సినిమాకు హైలైట్. పాటలు అదిరిపోయాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. గోవాను చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. కేవలం 2 గంటల్లోనే సినిమా అయిపోతుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈసారి కూడా అదరగొట్టాడు. కామెడీతో బాగా నవ్వించాడు. ముఖ్యంగా డైలాగ్స్, వన్ లైనర్స్ అదిరిపోయాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ నిర్మాణం చాలా ఉన్నతంగా ఉంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా మ్యాడ్ స్క్వేర్.. డబుల్ డోస్ ఎంటర్‌టైన్మెంట్ గ్యారెంటీ..