Macherla niyojakavargam: ఆ హీరోయిన్ నో అంటేనే నితిన్‌తో అంజలి చిందేసిందట..
నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం. రంగ్ దే సినిమాతర్వాత నితిన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.. డైరెక్టర్ ఏం రాజశేఖర్ రెడ్డి తెరెకెక్కిస్తున్న..

నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం(Macherla niyojakavargam). రంగ్ దే సినిమాతర్వాత నితిన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.. డైరెక్టర్ ఏం రాజశేఖర్ రెడ్డి తెరెకెక్కిస్తున్న ఈ మూవీలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్ రా.. రా.. రెడ్డి.. ఐయామ్ రెడీ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో హీరోయిన్ అంజలి నితిన్‌తో స్టెప్పులేసింది. ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. రారా రెడ్డి.. సాంగ్ విడుదల ఈవెంట్లో నితిన్ ఫస్ట్ మూవీ జయం సినిమాలోని రాను రాను అంటూనే చిన్నదో పాటకు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ పాటకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే నితిన్, సదా కలిసి నటించిన జయం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని రాను రాను అంటూనే చిన్నదో పాటను ఇందులో రెమిక్స్ చేశారు. అయితే ఈ పాట కోసం ముందుగా సదాను సంప్రదించారట మేకర్స్. జయం సినిమాలోని పాట కావడంతో సదా అయితే ఈ పాటకు మరింత మైలేజ్ వస్తుందని భావించారట మేకర్స్ . అయితే అందుకు సదా సున్నితంగా నో చెప్పిందట. అప్పుడు నితిన్ సరసన హీరోయిన్ గా చేసి ఇప్పుడు స్పెషల్ సాంగ్ లో కనిపించడం ఇష్టంలేక సదా నో చెప్పారని అంటున్నారు. సదా నో చెప్పడంతో నితిన్ తో కలిసి అంజలి చిందేయల్సి వచ్చిందట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.



