Vikram Kumar: సూర్య మూవీకి సీక్వెల్ తీస్తానంటున్న విక్రమ్ కుమార్.. ఆ సినిమా ఏంటంటే
విక్రమ్ కుమార్ కే .. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు విక్రమ్. ప్రస్తుతం నాగ చైతన్య తో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.

విక్రమ్ కుమార్ కే(Vikram Kumar) .. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు విక్రమ్. ప్రస్తుతం నాగ చైతన్య తో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాలో చైతు మూడు గెటప్స్ లో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నాగ్ చైతన్యతో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు విక్రమ్. ఇదిలా ఉంటే విక్రమ్ తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. తమిళ్ లో స్టార్ హీరో సూర్య విక్రమ్ కాంబినేషన్ లో 24 సినిమా వచ్చిన విషయం తెలిసిందే. టైం ట్రావెల్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల థాంక్యూ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 24 సినిమా గురించి ప్రస్తావించారు విక్రమ్. తాను తెరకెక్కించిన సినిమాల్లో 24 సినిమా అంటే తనకు బాగా ఇష్టమని.. అంతకుముందు తమిళంలోగానీ .. తెలుగులోగాని రాలేదు అని అన్నారు. సినిమా స్టోరీలో లోపాలు చూడకూడదని.. సూర్య పాత్రలోని స్వభావాలు, వైవిధ్యం చూడాలని అన్నారు. ఇక 24 సినిమా థియేటర్స్ లో కంటే టీవీల్లోనే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిందని. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని అన్నారు విక్రమ్. చాలా మంది ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు అంటూ తనను అడుగుతున్నారని. అందువల్ల ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన ఉంది అని అది కూడా సూర్యతోనే చేస్తానని అన్నారు విక్రమ్ కుమార్.



