Balakrishna: బాలయ్య 110 వ సినిమా ఆ దర్శకుడితోనేనా..? టైటిల్ కూడా కన్ఫామ్ అయ్యిందా..?

నటసింహం సందమూరి బాలకృష్ణ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Balakrishna: బాలయ్య 110 వ సినిమా ఆ దర్శకుడితోనేనా..? టైటిల్ కూడా కన్ఫామ్ అయ్యిందా..?
Balakrishna
Follow us

|

Updated on: Jul 16, 2022 | 6:40 AM

నటసింహం సందమూరి బాలకృష్ణ(Balakrishna) సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అఖండ సినిమా భారీ విజయాన్ని మాత్రమే కాదు కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. బాలకృష్ణ కెరీర్ లో 107 వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకోసం పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసే పనిలో ఉన్నారు గోపీచంద్. ఇదిలా ఉంటే బాలయ్య 108 సినిమా సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మధ్యలో 109 వ సినిమా ఉంది. ఇది పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య 110 సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలకృష్ణ కృష్ణవంశీ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. నిజానికి బాలయ్య 100 వ సినిమాగా ఈ కాంబో రావాల్సి ఉంది. ఈ సినిమాకు రైతు అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. కానీ అది కుదరలేదు. నటసింహం 100 వ సినిమాగా శాతకర్ణి వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మ్యాజిక్ నెంబర్ బాలయ్య 110 వ మూవీగా రైతు సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి