Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA OTT: డిటెక్టివ్‌ ఏజెంట్‌గా షణ్ముఖ్‌ జస్వంత్‌.. ఆసక్తికరంగా ట్రైలర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..

Agent Anand Santosh: సినీ ప్రియులకు 100 పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (AHA OTT). వివిధ భాష్లలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలను తెలుగులోకి డబ్‌ చేయడంతో పాటు సస్పెన్స్‌ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్‌లను..

AHA OTT: డిటెక్టివ్‌ ఏజెంట్‌గా షణ్ముఖ్‌ జస్వంత్‌.. ఆసక్తికరంగా ట్రైలర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..
Agent Anand Santosh
Follow us
Basha Shek

|

Updated on: Jul 15, 2022 | 9:25 PM

Agent Anand Santosh: సినీ ప్రియులకు 100 పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (AHA OTT). వివిధ భాష్లలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలను తెలుగులోకి డబ్‌ చేయడంతో పాటు సస్పెన్స్‌ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తోంది. ఇక అన్‌స్టాపబుల్‌, ఇండియన్‌ ఐడల్‌ లాంటి గేమ్‌ షోస్‌, సింగింగ్‌ కాంపిటీషన్లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక కొత్త వాళ్లను, కొత్త కథలను ప్రోత్సహించడంలో ముందుడే ఆహా మరో సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అదే ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌ (AAS) వెబ్‌ సిరీస్‌. యూట్యూబ్‌ స్టార్‌ షణ్మఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) హీరోగా నటిస్తున్నాడు. అరుణ్‌ పవార్‌ దర్శకత్వం వహించారు. సత్యదేవ్‌ చెడ్డ, వందన, ఇన్ఫినిటమ్‌ నెటవర్క్‌ సొల్యూషన్స్‌ సంయుక్తంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. టీజర్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

ఏజెంట్‌ ఆనంద్ సంతోష్‌ సిరీస్‌లో ప్రిథ్వి ఝకాస్‌, దివ్య, జనార్ధన్‌, వైశాలి రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ జులై 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. మొత్తం 10 ఎపిసోడ్స్‌ గల ఈ వెబ్‌సిరీస్‌లో ప్రతివారం ఒక కొత్త ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఇక సిరీస్‌ కథ విషయానికొస్తే.. సంతోష్‌ (షణ్ముఖ్‌) డిటెక్టివ్‌ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలోనే భాగంగా ఒక డిటెక్టివ్‌ ఏజెన్సీలో చేరుతాడు. అక్కడ తన స్నేహితుడు అయోమయం (ప్రిథ్వి ఝాకాస్‌) తో కలిసి ఎలాంటి కేసులు పరిష్కరించారు? ఈ క్రమంలో వారికి ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకోవాలంటే జులై 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోయే AAS సిరీస్‌ను చూసేయండి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!