Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandramukhi 2: సూపర్ స్టార్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్న రాఘవ లారెన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన హారర్ మూవీ చంద్రముఖి సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. పి. వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హర్రర్‌ చిత్రాల్లో ఓ ల్యాండ్‌మార్క్‌ను క్రియేట్‌ చేసింది.

Chandramukhi 2: సూపర్ స్టార్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్న రాఘవ లారెన్స్
Lawrence
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 16, 2022 | 6:20 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన హారర్ మూవీ చంద్రముఖి(Chandramukhi) సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. పి. వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హర్రర్‌ చిత్రాల్లో ఓ ల్యాండ్‌మార్క్‌ను క్రియేట్‌ చేసింది. రజనీకాంత్ తో పాటు జ్యోతిక, నయనతార, ప్రభు తమ అద్భుత నటనతో అదరగొట్టారు. తమిళ, తెలుగు భాషల్లో వసూల్ల వర్షం కురిపించిన ఈ సినిమాకు దాదాపు 17 ఏళ్ల తర్వాత సీక్వెల్‌ రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హౌస్‌ లైకా ప్రొడ‌క్షన్స్‌ (Lyca Productions) ఇటీవ‌లే అధికారికంగా చంద్రముఖి2 ను ప్రకటించింది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన పి వాసు ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. రాఘ‌వా లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు హీరో లారెన్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ ని హీరో రాఘవ లారెన్స్ శుక్రవారం చెన్నైలోని ఆయన నివాసంలో మర్యదపూర్వకంగా కలుసుకున్నారు. చంద్రముఖి సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రజనీ ఆశీర్వాదం తీసుకున్నారు లారెన్స్. ఈ నేపథ్యంలో లారెన్స్ రజినీకాంత్  మోకాళ్లపై పడుకుని నమస్కారం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. ఈ రోజు ‘చంద్రముఖి 2’ రెగ్యులర్ షూటింగ్ నా తలైవర్ నా గురు రజనీకాంత్ ఆశీర్వాదంతో మైసూర్ లో మొదలైంది అంటూ లారెన్స్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి