Sushmita Sen- Lalith Modi: నేడు లలిత్ మోదీ ప్రేమ వలలో బంధీ.. పెళ్లి, పురుషుల గురించి సుస్మిత గతంలో ఏమన్నారంటే..?

Janardhan Veluru

Janardhan Veluru |

Updated on: Jul 15, 2022 | 6:58 PM

న్నీ కుదిరితే త్వరలో సుస్మితను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా లలిత్ మోదీ ఓపెన్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే గతంలో సుస్మిత పెళ్లి గురించి.. పురుషుల గురించి మాట్లాడిన మాటలు.. అటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Sushmita Sen- Lalith Modi: నేడు లలిత్ మోదీ ప్రేమ వలలో బంధీ.. పెళ్లి, పురుషుల గురించి సుస్మిత గతంలో ఏమన్నారంటే..?
Susmita Sen
Image Credit source: TV9 Telugu

Sushmita Sen- Lalith Modi: సెలబ్రిటీ స్టేటస్‌ ఉన్న స్ట్రాంగ్‌ ఉమెన్స్‌లో సుస్మిత సేన్ ఒకరు. ఓ పక్క బీ టౌన్‌లో సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూనే.. ఫ్యాషన్ రంగంలో స్టార్ మోడల్ గా కొనసాగుతున్నారు. మరో పక్క ఓ ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్‌గా.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని మరీ వారి ఆలనపాలన చూస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసిన సుష్మిత పెళ్లికి మాత్రం ఎప్పుడూ నో చెబుతూ వస్తున్నారు. నో చెప్పడమే కాదు.. ఆమె ముందు ఎవరైన పెళ్లి మాట ఎత్తితే తన స్టైల్లో క్లాసు పీకేవారు. అయితే అలాంటి సుష్మితతో తాను డేట్ చేస్తున్నట్లు IPL ఫౌండర్, మాజీ చైర్మన్ లలిత్ మోదీ చేసిన ప్రకటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతే కాదు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసి.. మీడియా నోళ్లకు కావాల్సినంత మసాలా ఇచ్చేశారు. అన్నీ కుదిరితే త్వరలో సుస్మితను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా లలిత్ మోదీ ఓపెన్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే గతంలో సుస్మిత పెళ్లి గురించి.. పురుషుల గురించి మాట్లాడిన మాటలు.. అటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటు బీ టౌన్‌లోనూ హాట్ టాపిక్ గా మారాయి.

గతంలో ట్వింకిల్ ఖన్నా షో.. ‘ట్వీక్ షో’కు గెస్ట్ గా వెళ్లిన సుస్మిత.. ఆమె జీవితంలోని వివిద సంఘటనల గురించి వివరించారు. పెళ్లి చేసుకోకపోవడానికి మీరు దత్తత తీసుకున్న పిల్లలే కారణమా? అని అడిగిన ప్రశ్నకు..కాదంటూ సమాధానం చెప్పారు సుస్మిత. తన పిల్లలు రెనీ , అలీసా తాను పెళ్లి చేసుకోకపోడానికి అసలే మాత్రం కారణం కాదన్నారు. తాను రెనీని దత్తత తీసుకున్న తరువాత తన ప్రాధాన్యతలు ఏమిటో తెలిసిన వ్యక్తే తనకు భర్తగా రావాలని అనుకున్నట్టు సుస్మితా చెప్పారు. అయితే అందులోనూ వారేమీ తన పిల్లల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాస్త భరోసా, తోడు ఉంటే చాలని చెప్పుకొచ్చారు. కాని తాను అనుకున్నట్టు ఏదీ జరగలేదని.. తాను రిలేషన్లో ఉన్న ప్రతీ సారి పెళ్లి వరకు వచ్చి ఆగేదని  తెలిపారు. దీనికి వారి ప్రియారిటీలు మాత్రమే కారణమని సుస్మిత అన్నారు. వారి ప్రియారిటీలు వారికుంటే.. ఒక స్ట్రాంగ్ ఉమెన్‌గా తన ప్రియారిటీలు తనకు ఉంటాయి కదాని ప్రశ్నించారు. అలా ప్రియారిటీలు సెట్ చేసుకుంటారు కాబట్టే .. పెళ్లి ముందు బొక్కబోర్లా పడుతున్నా అన్నారు. ఇప్పటి వరకు మూడు సార్లు పెళ్లి చేసుకునే స్థాయి నుంచి వెనక్కి వచ్చినట్టు సుస్మిత చెప్పారు. ఇక ఈ నిరాశను భరించలేకే.. తాను పెళ్లికి దూరంగా ఉంటున్నట్టు ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు.. తనకు తన పిల్లలే ప్రియారిటీ అని.. వారికి ఓ ఏజ్‌ వచ్చే వరకు తన అవసరం తప్పక ఉంటుందని అన్నారు.

ఇక మరో సారి మీడియోతో మాట్లాడుతూ.. ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పారు. వివాహ వ్యవస్థను నమ్ముతానని అన్నారు సుస్మిత. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పెళ్లి ఎప్పటికైనా తప్పకుండా చేసుకుంటానని.. కాని ఏ వయసులో చేసుకుంటానో ఇప్పుడే చెప్పలేనన్నారు. ఇక ఆ తరువాత తన సోషల్ మీడియా హ్యాండిలింగ్‌లో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు సుస్మిత. పెళ్లిని ఎవరు కనిపెట్టారో వారు నరకంలాగే ఉంటారంటూ ఓ కొటేషన్ ను పోస్ట్ చేశారు. ఆ కొటేషన్లో అప్పట్లో కొత్త చర్చను రగిల్చారు.

Sushmita Sen, Lalith Modi

Sushmita Sen, Lalith Modi

ఇలా పెళ్లి, పురుషులపై భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ మాజీ మిస్‌ యూనివర్స్.. తాజాగా లలిత్ మోదీతో మరో సారి డేటింగ్ లో ఉన్నారు. ఆర్య2 వెబ్‌ సిరీస్‌ తో చివరిసారిగా కనిపించిన ఈ బ్యూటీ.. తాజాగా లలిత మోదీతో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అంతే కాదు.. ఇప్పటికైతే డేటింగ్.. అన్నీ అనకున్నట్టు జరిగితే పెళ్లి కూడా జరగొచ్చు అని లలిత్ మోదీ స్టేట్మెంట్‌తో అందర్నీ షాక్ చేశారు.

పెళ్లి, పురుషుల విషయంలో భిన్నాభిప్రాయాలు కలిగిన స్ట్రాంగ్ ఉమెన్‌ సుస్మితా సేన్‌ను లలిత్ మోదీ ఎలా పడేశారబ్బా అన్న చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా నడుస్తోంది. లలిత్ మోదీకున్న ఆస్తులు, లగ్జరీ కార్లు సుస్మితా సేన్‌ను బంధీని చేసి ఉంటాయని కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికైనా లలిత్ మోదీని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినందుకు సుస్మితకు విషెస్ తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu