Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lalit Modi: ఐపీఎల్ నుంచి సుస్మితా సేన్ వరకు.. క్రికెట్‌ బ్యాడ్ బాయ్ లలిత్ మోడీ ప్రస్థానం….

ఇటీవల ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. 58 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డాడు ఐపీఎల్ బ్యాడ్ బాయ్. ఐపీఎల్‌ నుంచి బహిష్కరణ తర్వాత.. మరో సంచలన ప్రకటనతో..

Lalit Modi: ఐపీఎల్ నుంచి సుస్మితా సేన్ వరకు.. క్రికెట్‌ బ్యాడ్ బాయ్ లలిత్ మోడీ ప్రస్థానం....
Ipl Lalit Modi And Sushmita
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 15, 2022 | 4:12 PM

లేటు వయసులోనూ ఘాటు ప్రేమలో ఉన్నాడు ఐపీఎల్‌(IPL) సృష్టికర్త లలిత్‌ మోడీ (Lalit Modi). బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి(Miss Universe) సుస్మితా సేన్‌తో( Sushmita Sen) డేటింగ్‌‌లో(Dating) మునిగిపోయాడు. ఇటీవల ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. 58 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డాడు ఐపీఎల్ బ్యాడ్ బాయ్. ఐపీఎల్‌ నుంచి బహిష్కరణ తర్వాత.. మరో సంచలన ప్రకటనతో ఇంటర్నెట్‌ని హీటెక్కించాడు.  ఆయన చేసిన ఓ ట్వీట్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ట్వీట్‌లో అతను మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్ గురించిన వివరాలను అందించారు. భారత క్రికెట్‌లో మోడీ అత్యున్నత ర్యాంక్‌కు ఎదగడం ఎంత వేగంగా జరిగిందో అంతే వేగంగా ఆశ్చర్యపరిచింది. 2008 నుంచి 2010 వరకు ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉండి.. ఐపీఎల్ వివాదం తర్వాత ఇండియా నుంచి తప్పించుకుని పారిపోయాడు. అయితే హెడ్‌లైన్స్‌లో ఉండడం ఎలానో తెలిసిన కళ లలిత్ మోడీకి ఉంది. అందుకే  ఇప్పుడు నటి సుస్మితా సేన్‌తో అతని సంబంధం గురించి ప్రపంచం మొత్తం ఆసక్తిగా చర్చించుకుంటోంది. ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండాలనే ఆశయంతో లలిత్ మోడీ ప్రయాణం గురించి ఇక్కడ ఇప్పుడు తెలుసుకుందాం.

IPL సృష్టికర్త లలిత్‌ మోడీ..

వెరీ ఇంటిలిజెంట్, మోస్ట్ స్టైలిష్‌మెన్, ఐపీఎల్ బ్యాడ్ బాయ్ ఇలా చాలా పేర్లు లలిత్ మోడీ సొంతం. ఐపీఎల్ నుంచి వివాదాస్పదంగా నిష్క్రమించే ముందు క్రికెట్ రూపురేఖలను మార్చేశాడు. అతను క్రికెట్ ప్రపంచంలోకి నాటకీయ మార్గంలో ఎంట్రీ ఇచ్చి.. అంతే నాటకీయంగా బయటకు వెళ్లిపోయాడు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), మల్టీ-మిలియన్ డాలర్ల, ఫుట్‌బాల్-స్టైల్, ఫ్రాంచైజీ-ఆధారిత దేశీయ లీగ్, మోడీ ఊహించిన విధంగా అతను అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

క్రికెట్‌ను ఫాస్ట్‌లేన్‌లో తీసుకుడని చెప్పడం పెద్ద విషయం కాదు. అతను దాని కోసం చాలా కష్టపడి, నిందలు ఎదుర్కొని ఉండవచ్చు.. కానీ క్రికెట్ సంప్రదాయవాదులకు వ్యతిరేకంగా ఎంతో వర్కౌట్ చేశాడు అన్నది మాత్రం అంగీకరించవలసి ఉంటుంది. 2008లో తొలిసారిగా జరిగిన ఈ టోర్నమెంట్ క్రికెట్‌లో ఆర్థిక సూపర్ పవర్‌గా భారత్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఫలితంగా భారతదేశం ఇప్పటికీ IPL ప్రధాన ఎజెండా-సెట్టర్‌గా తన గుర్తింపును కొనసాగిస్తోంది.

వ్యాపార కుటుంబంలో పుట్టి.. సొంతంగా ఐపీఎల్‌ను పరిచయం చేసి..

లలిత్ కుమార్ మోడీ.. ఢిల్లీ ప్రముఖ భారతీయ వ్యాపార కుటుంబానికి చెందిన వారసుడు. అతను 29 నవంబర్ 1963 న ఢిల్లీలో కృష్ణ కుమార్ మోడీ  బీనా మోడీ దంపతులకు జన్మించాడు. 2018లో ఆయన భార్య మినాల్ మోడీ మరణించారు. ఈ ఐపీఎల్ రాజుకు రుచిర్ మోడీ, అలియా మోడీ అనే ఇద్దరు పిల్లలు. 90వ దశకం ప్రారంభంలో అతను స్పోర్ట్స్ పే ఛానెల్‌లను డిస్ట్రిబ్యూటర్‌గా మారి తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. అతను ఇండియన్ క్రికెట్ బోర్డుకి ప్రత్యర్థిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. భారతీయ టెలివిజన్ వినియోగదారులు చెల్లించే కొన్ని పే ఛానల్స్‌లో లైవ్ స్పోర్ట్స్ ఒకటి.. 2005లో BCCI అతి పిన్న వయస్కుడైన వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యాడు. అపుడే లలిత్ మోడీ పేరు వెలుగులోకి వచ్చింది.

మొండి వైఖరి వల్ల నష్టం

ICC నియో-వలసవాద పక్షపాతాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు లలిత్ మోడీ. అతని మొండితనం, ఘర్షణాత్మక విధానం అతనికి అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా కొద్దిమంది స్నేహితులను సంపాదించి పెట్టింది. దీంతో పాటు బీసీసీఐలో కూడా అతడిపై నిరసన స్వరాలు మొదలయ్యాయి. అతని ప్రముఖ క్రికెట్ వ్యాపారం ఊహించని వివాదంతో ముగిసింది. రెండు కొత్త ఐపిఎల్ ఫ్రాంచైజీల వేలానికి సంబంధించిన వెల్లడితో, అతని క్రికెట్ వ్యాపారం ఈ గోల్డెన్ జర్నీ ఒక విధంగా ఆగిపోయింది.

IPL 2010లో అతనిపై ఆరోపణలు వచ్చాయి. తన పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని, వేలంపాటలో  IPL టెండర్‌లో అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు వచ్చాయి. లలిత్ మోడీ ఐపీఎల్‌లో అక్రమాలు వెలుగులోకి వచ్చిన పదిహేను రోజుల తర్వాత BCCI అంతర్గత విచారణ చేపట్టింది. ఇందులో ఆరోపణల్లో నిజముందని తెలియడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. హాస్యాస్పదంగా 2010 ఐపీఎల్ ఫైనల్ ముగింపు వేడుక ముగిసిన తర్వాత లలిత్ మోడీ ఈ క్షణాలన్నింటినీ ఎదుర్కోవలసి రావడం విశేషం.

అతని అక్రమ సంపాధనపై ED అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇలా గుట్టు రట్టు కావడంతో నెమ్మదిగా దేశం విడిచి లండన్ పారిపోయాడు లలిత్ మోడీ. ఆ తర్వాత కూడా లలిత్ ఎప్పుడూ ఏదో ఒక అంశం హెడ్‌లైన్స్‌లో కనిపిస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు ప్రస్తుతం అతను మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్ గురించి చర్చలు జరుగుతోంది.

2013లోనే వీరి మధ్య..

2013 సంవత్సరంలో అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమని నిరూపితమైంది. దీంతో క్రికెట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పాల్గొనకుండా BCCI అతనిపై జీవితకాల నిషేధం విధించింది. అప్పటి నుంచి లలిత్‌ మోడీ లండన్‌లోనే తలదాచుకుంటున్నాడు. ఇప్పుడు సుస్మితాసేన్‌తో డేటింగ్‌.. త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు లలిత్‌. మరోవైపు 46 ఏళ్ల సుస్మితా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. పలువురితో డేటింగ్‌ చేసినా.. పెళ్లివరకు వెళ్లలేదు. అయితే ఇద్దరు అనాధలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది సుస్మితా సేన్‌.

క్రీడా వర్తల కోసం..