Mohammed Shami: వన్డేల్లో మహ్మద్ షమీ నయా రికార్డ్.. 80 మ్యాచ్‌ల్లో 150 వికెట్లతో..

Mohammed Shami: ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

Mohammed Shami: వన్డేల్లో మహ్మద్ షమీ నయా రికార్డ్.. 80 మ్యాచ్‌ల్లో 150 వికెట్లతో..
Shami
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 15, 2022 | 2:57 PM

Mohammed Shami: ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో కేవలం 19 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి ఆశిష్ నెహ్రా రికార్డ్‌ను బద్ధలు కొట్టాడు. ఇదే మ్యాచ్‌లో షమీ సైతం అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాడు. తన బౌలింగ్‌తో తుపాను సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టడం ద్వారా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు షమి. వన్డేల్లో అత్యంగా వేగంగా 150 వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

తొలి భారతీయ ఆటగాడు..

షమీ తను వేసిన 7 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కాగా, షమీ తన 80వ మ్యాచ్‌లో(79వ ఇన్నింగ్స్)లో ఈ ఫీట్‌ను సాధించడం ద్వారా అత్యంగా వేగంగా వన్డేల్లో 150 వికెట్లు తీసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఆ తరువాత స్థానంలో 97 వన్డేల్లో 150 వికెట్లు తీసిన అజిత్ అగార్కర్ రెండోవ భారతీయ ఆటగాడిగా నిలిచారు.

అంతర్జాతీయంగా 3వ స్థానంలో.. 

అంతర్జాతీయంగా చూస్తే.. మిచెల్ స్టార్క్ (77 మ్యాచ్‌లు), సక్లైన్ ముస్తాక్ (78 మ్యాచ్‌లు) తర్వాత అత్యంత వేగంగా (మ్యాచ్‌ల పరంగా) ల్యాండ్‌మార్క్ సాధించిన మూడో ఆటగాడిగా షమీ నిలిచాడు. రషీద్ ఖాన్ 80 మ్యాచ్‌లు ఆడి 150 వికెట్లు తీశాడు. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ టేకింగ్ పరాక్రమానికి సూచిక అయిన డెలివరీల సంఖ్య పరంగా స్టార్క్, మెండిస్, సక్లైన్, రషీద్ తర్వాత షమీ 150 వికెట్ల క్లబ్‌లో ఐదవ వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు.

వన్డే చరిత్రలో రెండవ అత్యుత్తమ స్ట్రైక్ రేట్..

షమీ 80 వన్డే మ్యాచ్‌లలో 5.61 సగటుతో 151 వికెట్లు సాధించాడు. షమీ బౌలింగ్ స్ట్రైక్ రేట్ 27గా ఉంది. ఇది వన్డే క్రికెట్‌లో రెండవ ఫాస్ట్‌ బౌలర్‌గా షమీని నిలిపింది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టార్క్ నిలిచాడు. ఇక 2015 ప్రపంచ కప్ ట్రోఫీతో ప్రపంచ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన షమి.. అనతి కాలంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచ కప్ టోర్నీలో 2013లో పాకిస్తాన్‌పై అరంగేట్రం చేసిన షమీ.. ఆ టోర్నో మొత్తంగా 47 మ్యాచ్‌లలో 24.89 సగటుతో 87 వికెట్లు పడగొట్టాడు.

అయితే, మోకాలి గాయం, వ్యక్తిగత సమస్యలు, మరికొన్నిసార్లు పేలవమైన ప్రదర్శన కారణంగా 2016, 2017, 2018 సంవత్సరాలలో క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 2019 జనవరిలో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌తో పునరాగమనం చేశాడు షమి. అప్పటి నుంచి వెనుదిరగి చూడలేదు. 2019 నుంచి కేవలం 28 మ్యాచ్‌లలో 24.12 సగటుతో, 25.2 స్ట్రైక్ రేటుతో 57 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా షమీ స్ట్రైక్ రేట్ 25.2 ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంది.

వన్డే చరిత్రలో SENA దేశాలలో అత్యుత్తమ స్ట్రైక్ రేట్..

సేనా(దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లోని సహాయక పరిస్థితుల్లో షమీ లైన్, లెంగ్త్, షార్ప్‌గా.. కొత్త, పాత బంతి అనే తేడా లేకుండా స్ట్రెయిట్ సీమ్‌తో బౌలింగ్ చేయగల సామర్థ్యం షమి సొంతం. ఈ నాలుగు దేశాలలో 38 మ్యాచ్‌లలో 21.12 సగటుతో 83 వికెట్లు తీశఆడు. వన్డే చరిత్రలో SENA లో షమీ స్ట్రైక్ రేట్ 22.8 గా ఉంది. ఈ లెక్కన షమీ.. స్టార్క్, బ్రెట్‌లీ, షేన్ బాండ్, వకార్ యూనిస్, ట్రెంట్ బౌల్ట్‌ లను మించిపోయాడనే చెప్పాలి.

వన్డే ఫార్మాట్‌లోని ఫ్లాగ్‌షిప్ టోర్నమెంట్..

50 ఓవర్ల ప్రపంచ కప్‌లో కూడా షమీ అద్భుతమైన రికార్డును నమోదు చేశాడు. రెండు ఎడిషన్‌లలో కేవలం 11 మ్యాచ్‌లలో 15.7 సగటుతో, 18.6 స్ట్రైక్ రేట్‌తో 31 వికెట్లు తీశాడు. ప్రపంచంలోని బౌలర్లందరిలో ఇదే అత్యుత్తమం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో 2015 ఎడిషన్‌లో కేవలం ఏడు మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు.

వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లోనూ..

టాప్ బ్యాట్స్‌మెన్ వికెట్లు తీయడంలో దిట్ట అయిన షమీ.. వన్డేల్లో మాత్రమే కాదు, టెస్టుల్లోనూ అదరగొట్టాడు. టెస్ట్‌లలో షమి స్ట్రైక్ రేట్ 50.1. ఇది ఆల్-టైమ్ జాబితాలో షమీని 11వ స్థానంలో ఉంచింది. 2019 నుండి ఐపిఎల్‌లో షమీ ప్రతి 17 బంతుల్లో ఒక వికెట్ తీసుకున్నాడు. స్ట్రైక్ రేట్ (16.8)లో బుమ్రా కంటే కొంచెం వెనుకబడి ఉన్నాడు. ఈ రికార్డ్స్‌ను బట్టి.. షమీ టెస్ట్ బౌలర్‌ మాత్రమే కాదు.. ఆల్ రౌండ్ బౌలర్ అని కరాఖండిగా చెప్పొచ్చు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..