IND vs ENG: లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత స్టార్ బౌలర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్..

Yuzvendra Chahal Record: లార్డ్స్‌లో జరిగిన రెండో వన్డేలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో తన పేరిట ఓ భారీ రికార్డును సొంతం చేసుకుంది.

IND vs ENG: లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత స్టార్ బౌలర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్..
Yuzvendra Chahal
Follow us
Venkata Chari

|

Updated on: Jul 15, 2022 | 3:01 PM

Yuzvendra Chahal Record: లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతని పేరిట ఓ భారీ రికార్డు నమోదైంది. లార్డ్స్‌లో వన్డే క్రికెట్ చరిత్రలో నాలుగు వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీలను పెవిలియన్‌కు పంపాడు.

రెండో వన్డేలో తొలుత ఆడిన ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు.. టీమిండియాకు 247 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్‌ తరపున మొయిన్ అలీ 47 పరుగులు చేశాడు. అదే సమయంలో డేవిడ్ విల్లీ 41 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరపున యుజ్వేంద్ర చాహల్ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. లెగ్ స్పిన్నర్ 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. భారత్ తరపున యుజ్వేంద్ర చాహల్ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. లెగ్ స్పిన్నర్ 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా కూడా రెండు ముఖ్యమైన వికెట్లు తీశాడు.