Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Warriorr Movie: బాక్సాఫీస్‌ వద్ద వారియర్‌ సత్తా.. మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే..

The Warriorr Movie Collections: సినిమా కాన్సెప్ట్‌ కొత్తగా ఉండడంతో పాటు రామ్‌ మరోసారి తన నటన, స్టెప్పులతో అదరగొట్టడంతో వారియర్ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అదే సమయంలో కథనం విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని కొందరు సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.

The Warriorr Movie: బాక్సాఫీస్‌ వద్ద వారియర్‌ సత్తా.. మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే..
The Warriorr
Follow us
Basha Shek

|

Updated on: Jul 15, 2022 | 8:28 PM

The Warriorr Movie Collections: టాలీవుడ్ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన తాజా చిత్రం దివారియర్‌ (The Warriorr). కృతిశెట్టి (Krithi Shetty) రామ్‌ పక్కన సందడి చేసింది. ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా, అక్షర గౌడ, నదియా, భారతీరాజా, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గురువారం (జూలై 14న) విడుదలైంది. సినిమా కాన్సెప్ట్‌ కొత్తగా ఉండడంతో పాటు రామ్‌ మరోసారి తన నటన, స్టెప్పులతో అదరగొట్టడంతో వారియర్ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అదే సమయంలో కథనం విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని కొందరు సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.

దివారియర్‌ సినిమా టాక్‌ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయంటున్నారు ట్రేడ్‌ పండితులు. మొత్తంగా రూ.39.10 కోట్లు ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిపిన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.73 కోట్లు రాబట్టింది. ఇందులో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచే రూ.7 కోట్ల పైచిలుకు షేర్‌ వసూళ్లు ఉన్నాయి. ఇక కర్ణాటకలో రూ.32 లక్షలు, తమిళనాడులో రూ.94 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 30 లక్షల కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్‌ నిపుణులు తెలిపారు. వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని చిత్రబృందం చెబుతోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. అతని సారథ్యంలో రూపుదిద్దుకున్న పాటలు ఇప్పటికే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!