Ram Charan: చరణ్ కోసం మునుపెన్నడూ చూడని ఫైట్ సీన్ ప్లాన్ చేస్తున్న శంకర్..!
టాప్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రోబో 2 తర్వాత శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటిస్తోన్న..

టాప్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రోబో 2 తర్వాత శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ ( Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన గత సినిమాల్లాగే చెర్రీ చిత్రాన్ని కూడా రిచ్‌గానే తెరకెక్కిస్తున్నారు శంకర్. భారీ సెట్టింగులు, హంగులతో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే పంజాబ్ లొకేషన్స్‌లో రామ్‌చరణ్, కియారాలపై దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ ను షూట్ చేశారట. దీంతో పాటు హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లోనూ ఈ పాట చిత్రీకరణ కొనసాగనుందట. ఇదిలా ఉంటే ఈ సాంగ్ తో పాటు ఓ భారీ యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ వేసిన భారీ సెట్స్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో పాల్గొనడానికి కియారా కూడా ఇటీవలే వచ్చేసింది. ఇక్కడ భారీ యాక్షన్ సీన్ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో ఈ ఫైట్ వస్తుందని అంటున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఫైట్ ను డిజైన్ చేస్తున్నారట. ఈ ఫైట్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే. సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



